Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రేపు లా, పీజీ‌ లా‌సెట్‌ ఫలి‌తాలు విడుదల
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరు వర్గాల ఘర్షణ
  • ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం
  • వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్
  • లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఆ డబ్బు ఏం చేస్తారు? | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

ఆ డబ్బు ఏం చేస్తారు?

Tue 21 Jun 03:25:27.928058 2022

- ఐపీఎల్‌ మీడియా హక్కులకు రికార్డు ధర 
- క్రికెట్‌ అభివృద్దికి నిధులు కేటాయిస్తారా?

             ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన స్పోర్ట్స్‌ లీగ్‌గా నిలిచింది. ప్రపంచ ధనిక క్రికెట్‌ బోర్డు బీసీసీఐ.. ఐసీసీకి సైతం అందనంత ఎత్తుకు చేరుకుంది. 2023-27 ఐపీఎల్‌ సీజన్లకు నిర్వహించిన ఈ వేలంలో బీసీసీఐ రూ.48,390.32 కోట్లు ఖాతాలో వేసుకుంది. ఒక్కో ఐపీఎల్‌ మ్యాచ్‌కు ఇక నుంచి బోర్డు రూ.118.02 కోట్లు ఆర్జించనుంది. గణాంకాలు గొప్పగా కనిపిస్తున్నాయి, కానీ ఈ సొమ్ము అంతా ఎక్కడికి వెళ్లనుంది?!.
నవతెలంగాణ క్రీడావిభాగం
             భారత్‌లో క్రికెట్‌ ఓ ఆట కాదు, అంతకుమించి!!. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మీడియా హక్కుల వేలం ధర అందుకు సరికొత్త నిదర్శనం. సంప్రదాయ టెలివిజన్‌ మార్కెట్‌ను వెనక్కి నెట్టి డిజిటల్‌ ప్రసార హక్కులు అత్యధిక ధర సొంతం చేసుకోవటం విశేషం. ఐపీఎల్‌ నుంచి రానున్న ఐదేండ్లలో రూ.48,390.32 కోట్లు ఆర్జించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. గత ఐదేండ్ల కాలంతో పోల్చితే ఈ ధర అంచనాలకు అందనిది. ఐపీఎల్‌కు లభించిన ఆదరణతో ఐసీసీ సైతం మెగా ఈవెంట్ల మీడియా హక్కులను భారత మార్కెట్‌కు ప్రత్యేకంగా అమ్మేందుకు సిద్ధమైంది. ఐపీఎల్‌ మీడియా హక్కుల ద్వారా ఇంత భారీ మొత్తం ఆర్జించనున్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ఆ సొమ్ముతో ఏం చేయనుంది. ఐపీఎల్‌ ఆదాయంతో నిజంగానే దేశవాళీ క్రికెట్‌లో మౌళిక సదుపాయాల కల్పన, ఆధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయా?!. క్రికెట్‌ అభిమానులకు ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్న!.
ప్రాంఛైజీలకు సగం సొత్తు : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఒప్పందం ప్రకారం మీడియా హక్కుల ఆదాయంలో సగం మొత్తం ప్రాంఛైజీలకు వెళ్లనుంది. బీసీసీఐ, ప్రాంఛైజీల విలువైన ఒప్పందం ఇది. రానున్న ఐదేండ్లకు ఐపీఎల్‌ మీడియా హక్కుల ఆదాయం రూ.48,390.32 కోట్లు. ఇందులో సగం అంటే, రూ.24,195.16 కోట్లు ప్రాంఛైజీలకు పంచాల్సి ఉంటుంది. మిగతా రూ.24,195.16 కోట్లు నేరుగా బీసీసీఐ ఖాతాల్లోకి వెళ్లిపోతుంది. ప్రతి సీజన్‌కు మీడియా హక్కుల రూపంలో రూ.9678.064 కోట్ల ఆదాయం బీసీసీఐ ఆర్జించనుంది. ఇందులో సగం రూ.4839.032 కోట్లు ప్రాంఛైజీలు అందుకోనున్నాయి. ఐపీఎల్‌లో ప్రస్తుతం పది ప్రాంఛైజీలు ఉన్నాయి. ప్రతి సీజన్‌కు ఒక్కో ప్రాంఛైజీకి రూ.483.90 కోట్లు మీడియా హక్కుల రూపంలో ఆదాయం లభించనుంది. మీడియా హక్కులు కాకుండా ఇతర ఒప్పందాలు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా లభించే ఆదాయాన్ని సైతం ప్రాంఛైజీలతో బోర్డు పంచుకోవాల్సి ఉంటుంది. లెక్కన ప్రతి సీజన్‌కు ప్రాంఛైజీలకు బీసీసీఐ నుంచి లభించే ఆదాయమే రూ.500-600 కోట్ల వరకు ఉండనుంది. బీసీసీఐ వాటా రూ.24,195.16 కోట్లకు ప్రభుత్వానికి ఎటువంటి పన్ను చెల్లించదు. దీంతో ప్రతి పైసా నేరుగా బోర్డు ఖాతాలోకి వెళ్లనుంది.
పారదర్శకత లోపం : బీసీసీఐ ఆర్జించే ఆదాయం పూర్తిగా తన వద్దే ఉంచుకోదు. రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు సబ్సిడీలు, గ్రాంట్ల రూపంలో పంచుతుంది. ఐపీఎల్‌ ఆదాయంతో ప్రతి రాష్ట్ర సంఘానికి ప్రత్యేక వాటా అందుతుంది. నేరుగా 'నగదు బదిలీ' రూపంలో ఐపీఎల్‌ ప్రత్యేక గ్రాంట్‌ రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు చేరుతుంది. ఈ డబ్బును ఎలా ఖర్చు చేయాలనే విషయంలో బోర్డు నుంచి ఎటువంటి షరతులు ఉండవు. ఇది రాష్ట్ర క్రికెట్‌ సంఘాల్లో తీవ్రమైన అవినీతికి దారితీస్తుంది. నిలకడగా కోట్ల రూపాయల గ్రాంట్లు అక్రమార్కుల చేతుల్లో పడటం.. ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుంది. అన్ని రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు వ్యవస్థీకృత ఆర్థిక విధానం లేదు. బీసీసీఐ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో పలు రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు ఇప్పటికే కోర్టు కేసులు ఎదుర్కొంటున్నాయి. తొలుత, రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు పారదర్శకత పాటించేలా బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలి. కోర్టు కేసులతో ఎన్నుకోబడిన కార్యవర్గం సస్పెన్షన్‌కు గురవటం ఇటీవల సహజ ప్రక్రియగా మారింది. ఈ పరిస్థితులకు దారితీయకుండా, రాష్ట్ర క్రికెట్‌ సంఘాల నిధులపై నిఘా ఉంచేందుకు బోర్డు అడుగు ముందుకేయాలి. రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు క్రికెట్‌ అభివృద్దికి ఎక్కడ ఏం చేయాలనే సూచనలను బీసీసీఐ నేరుగా ఆదేశించేలా ఉండాలి. ఆర్థిక పారదర్శకత, అభివృద్దికి నిధుల కేటాయింపు లేకపోతే.. బోర్డు నుంచి గ్రాంట్లు నిలిపివేయాలి. కాగా, సమీప కాలంలో బోర్డు నుంచి ఇటువంటి విప్లవాత్మక నిర్ణయాలు ఆశించలేం.
ప్రాంఛైజీలు భాగమవ్వాలి : ఐపీఎల్‌ ఆదాయంలో ప్రాంఛైజీలు సగ భాగం ఎత్తుకుపోతున్నాయి. ఐపీఎల్‌ ప్రాంఛైజీల లాభం... క్రికెట్‌ నష్టం!. 2008లో దూరదృష్టితో ఆలోచన చేసిన సంస్థలు ఐపీఎల్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. అందుకు తగిన ప్రతిఫలం ప్రాంఛైజీల యాజమాన్యాలకు దక్కి తీరాలి. కానీ ఏటా రూ.500 కోట్ల వరకు బీసీసీఐ నుంచి అందుకుంటున్న ప్రాంఛైజీలు క్రికెట్‌ అభివృద్దికి చేస్తున్న ఖర్చు శూన్యం. ప్రాంఛైజీలు అకాడమీలు ఏర్పాటు చేసుకున్నా.. అవి ఆ ప్రాంఛైజీ ఆటగాళ్ల సాధన కోసమే. దేశవాళీ క్రికెట్‌లో వర్థమాన క్రికెటర్ల అన్వేషణ, నైపుణ్యాభివృద్దితో ప్రాంఛైజీలకు నిజానికి సంబంధం లేదు. ఒకవేళ క్షేత్రస్థాయిలో ఆ పని చేసినా ఆ ఆటగాడిని నేరుగా జట్టులోకి తీసుకోవడానికి వీల్లేదు. ఆటగాళ్ల వేలంలో ఇతర ప్రాంఛైజీలతో పోటీపడక తప్పదు. దేశవాళీ క్రికెట్‌ అభివృద్ది పూర్తిగా బోర్డు, రాష్ట్ర క్రికెట్‌ సంఘాల బాధ్యత. ఆధునిక క్రికెట్‌లో ప్రాంఛైజీలను సైతం భాగస్వామిగా చేయాల్సి అవసరం ఉంది. ఐపీఎల్‌ నుంచి విలువైన ఆదాయం ఆర్జిస్తున్న ప్రాంఛైజీలు కొంతైనా మౌళిక సదుపాయాల కల్పనకు ఉపయోగించాలి. రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు, ఐపీఎల్‌ ప్రాంఛైజీల నడుమ సంబంధాలు ఏమంత గొప్పగా లేవు. సొంత మైదానంలో ఏడు మ్యాచుల నిర్వహణలో ప్రాంఛైజీలకు గ్రౌండ్లు ఇవ్వటం వరకే తమ బంధం అన్నట్టు రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు వ్యవహరిస్తున్నాయి. నూతన అకాడమీలు ఏర్పాటు, ప్రతిభాన్వేషణ కార్యక్రమాల నిర్వహణ, అకాడమీల్లో మౌళిక సదుపాయాల కల్పన, సంయుక్త టోర్నీల నిర్వహణ వంటి వాటిలో రాష్ట్ర క్రికెట్‌ సంఘాలతో ప్రాంఛైజీలు జట్టు కట్టవచ్చు. అప్పుడే ఐపీఎల్‌ ఆదాయం దేళవాళీ క్రికెట్‌కు న్యాయం చేకూర్చగలదు.
ప్రేక్షకుడికి పట్టం కడతారా?!
             ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మీడియా హక్కుల ఆదాయం ఆకాశానికి చేరటంలో అత్యంత ముఖ్య పాత్ర పోషించింది క్రికెట్‌ అభిమాని. ఐపీఎల్‌లో తొలి పదేండ్లతో పోల్చితే.. తర్వాతి ఐదేండ్లకు బోర్డు భారీగా ఆర్జించింది. అయినా, స్టేడియాల నిర్వహణలో ఎటువంటి మార్పులు లేవు. తాజాగా, బోర్డు ఆదాయం రూ.50 వేల కోట్లకు చేరినా పరిస్థితులు అలాగే ఉంటాయా? అనే అనుమానం కలుగుతోంది. ఐపీఎల్‌ వేదికల్లో చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల పైకప్పులు సైతం లేవు. మరుగుదోడ్ల శుభ్రత, త్రాగునీరు సదుపాయం, సౌకర్యవంతమైన సీటింగ్‌లపై బీసీసీఐ దృష్టి సారించాలి. ఆహ్లాదకర వాతావరణంలో ప్రేక్షకుడికి మెరుగైన వినోదం అందించటం బోర్డు కర్తవ్యం. ఈ దిశగా రానున్న సీజన్లకు కనీసం ఐపీఎల్‌ వేదికల అభివృద్దికి నడుం బిగించాలి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కూత మొదలైంది
వాషింగ్టన్‌కు గాయం
ఆకాశమే హద్దుగా..!
సస్పెన్షన్‌ ముప్పు?
స్వర్ణ యుగం మొదలైంది!
ప్రయోగాలు ఫలించేనా?
ఫిఫా రీ షెడ్యూల్‌ ఇదే!
మళ్లీ బ్యాట్‌ పట్టనున్న గంగూలీ
ఐపీఎల్‌ ఉమెన్స్‌ తొలి సీజన్‌ ముహూర్తం ఖరారు!
కెఎల్‌ రాహుల్‌ ఫిట్‌
కొత్త పంథా!
బెంగాల్‌కు బీసీసీఐ నో!
ఇక పసిడి వేట
రేసులో రజతానందం
రెజ్లర్ల పసిడి పట్టు
రూపాల్‌కు కాంస్యం
రజత శంకర్‌
హైదరాబాద్‌లో భారత్‌, ఆసీస్‌ టీ20
2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌?
సూర్య నం.2
రిలే రేసులో రజతం
షట్లర్ల సిల్వర్‌ షో
లాన్‌ బౌల్స్‌లో నవ చరిత్ర
28న భారత్‌, పాక్‌ ఢీ
సమం చేశారు!
మంధాన నం.3
పాక్‌లో ఇంగ్లాండ్‌ పర్యటన!
లాన్‌బాల్‌లో మహిళల నయా చరిత్ర
కామన్వెల్త్‌ గేమ్స్‌ - 2022
నార్వేకు షాక్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.