Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్ర స్థాయి స్ప్రింట్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో జింఖానా గ్రౌండ్స్ అథ్లెట్లు సత్తా చాటారు. హన్మకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు కొల్లగొట్టారు. మహిళల 100, 200 మీటర్ల రేసులో రమా వైష్ణవి స్వర్ణం, జోషి 400మీ రేసులో స్వర్ణం, 200మీ రేసులో రజతం సాధించారు. అండర్-20 విభాగంలో ఫర్హనుద్దీన్ (400మీ పసిడి, 200మీ రజతం), సహేరా భాను (100మీ స్వర్ణం, 200మీ సిల్వర్), తరుణ్ కుమార్ రాజు (400మీ సిల్వర్) పతకాలు గెల్చుకున్నారు. అండర్-18 విభాగం 400 మీటర్ల రేసులో రమేశ్ సింగ కాంస్య పతకం అందుకున్నాడు. అండర్-16 విభాగంలో హర్షిత (200మీ కాంస్యం), ప్రీతి తివారి (400మీ కాంస్యం) మెరిశారు. అండర్-12 విభాగం 300మీ రేసులో హర్ష కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. పతకాలు సాధించిన అథ్లెట్లను, కోచ్ జి. రాజేశ్‌ను హైదరాబాద్ జిల్లా క్రీడాధికారి ఎన్. సుధాకర్ రావు అభినందించారు.