Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత ఒలింపిక్ సంఘం ప్రయత్నాలు
న్యూఢిల్లీ : ఎట్టకేలకు జాతీయ క్రీడలకు మోక్షం కలుగనుంది!. దశాబ్దకాలంగా జాతీయ క్రీడలను వాయిదా వేస్తూ వస్తున్న గోవా ఒలింపిక్ సంఘాన్ని పక్కనపెట్టి.. ఇతర వేదికలపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) దృష్టి సారించింది. ఆసియా క్రీడలు వాయిదా పడటంతో ఆ షెడ్యూల్ను జాతీయ క్రీడలకు సద్వినియోగం చేసుకోవాలని ఐఓఏ భావిస్తోంది. సెప్టెంబర్ 10-25న జాతీయ క్రీడల నిర్వహణ కోసం నాలుగు రాష్ట్రాలకు లేఖలు రాసింది. జాతీయ క్రీడల నిర్వహణకు మరో ఆరు నెలల గడువు కావాలని గోవా రాష్ట్ర ప్రభుత్వం కోరటంతో.. ఐఓఏ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్లో జాతీయ క్రీడల నిర్వహణకు తమ అభిప్రాయాలను, సమ్మతిని తెలియజేయాల్సిందిగా జాతీయ క్రీడా సమాఖ్యలు, రాష్ట్ర ఒలింపిక్ సంఘాలకు ఐఓఏ సూచించింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడల నిర్వహణ పట్ల సానుకూలంగా ఉన్నట్టు ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా పేర్కొన్నారు.