Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరంభ మ్యాచ్లో సౌదీపై ఖతార్ గెలుపు
హైదరాబాద్: 24వ ఆసియా మెన్స్ క్లబ్ లీగ్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. తెలంగాణ క్రీడా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావులు గురువారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పోటీలను ప్రారంభించారు. ' ఆసియా చాంపియన్షిప్ నిర్వహణ పట్ల సంతోషంగా ఉంది. క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని' సందీప్ సుల్తానియా అన్నారు. ' హైదరాబాద్లో హ్యాండ్బాల్ అభివృద్దికి ఇది తొలి అడుగు. భవిష్యత్లో అంతర్జాతీయ టోర్నీలను నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం అపూర్వం' అని జగన్మోహన్ రావు తెలిపారు. కార్యక్రమంలో ఆసియా హ్యాండ్బాల్ ఫెడరేషన్ ప్రతినిధులు, భారత ఒలింపిక్ సంఘం కోశాధికారి ఆనందీశ్వర్ పాండే తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, అల్ నూర్ (సౌదీ అరేబియా)- అల్ అరబీ స్పోర్ట్స్ క్లబ్ (ఖతార్) మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్లో అల్ అరబీ జట్టు 29-24తో అల్ నూర్పై గెలుపొందింది. ప్రథమార్థంలో అల్ అరబీ 14-13తో స్వల్ప ఆధిక్యంలో నిలువగా, విరామం అనంతరం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అల్ అరబీ ఆటగాడు పౌలో 6 పాయింట్లతో ఉత్తమ ఆటగాడిగా నిలిచాడు.