Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి 374/10, మధ్యప్రదేశ్ 123/1
బెంగళూరు: రంజీట్రోఫీ ఫైనల్ హోరాహోరీగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబయి 374పరుగులకు ఆలౌట్ కాగా.. మధ్యప్రదేశ్ జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 123 పరుగులు చేసింది. ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(134)సెంచరీతో అదరగొట్టాడు. రెండోరోజు 24ఏళ్ల సర్ఫరాజ్ చెలరేగి ఆడాడు. ఓవర్ నైట్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 248పరుగులతో శుక్రవారం ఆటను కొనసాగించిన ముంబయి జట్టు సర్ఫరాజ్ ఆదుకోగా.. రెండోరోజు ఆట తొలి బంతికే శ్యామ్స్ ములాని(12)ని గౌరవ్ యాదవ్ ఎల్‌బిగా పెవీలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత తనుష్(15), కులకర్ణి(1) సాయంతో ముంబయిను ఆదుకున్నాడు. చివరి వికెట్‌గా ఔటైన సర్ఫరాజ్ ముంబయి జట్టు గౌరవప్రద స్కోర్ చేసేందుకు దోహదపడ్డాడు. యాదవ్‌కు నాలుగు, అగర్వాల్‌కు మూడు, జైన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం మధ్యప్రదేశ్ జట్టును దూబే(44నాటౌట్), శామ్స్(41నాటౌట్) ఆదుకున్నా.. మరో ఓపెనర్ హిమాన్షు(31)ను దేశ్‌పాండే ఔట్ చేశాడు.
భావోద్వేగానికి గురైన సర్ఫరాజ్..
సెంచరీ కొట్టిన అనంతరం సర్ఫరాజ్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సీజన్లో సర్ఫరాజ్‌కు ఇది నాలుగవ సెంచరీ. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతనికి ఇది 8వ సెంచరీ. సర్ఫరాజ్ సెంచరీ సంబరాలను బిసిసిఐ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వ్యక్తిగత స్కోర్ 40పరుగుల వద్ద రెండోరోజు బ్యాటింగ్‌కు కొనసాగించిన సర్ఫరాజ్.. 243బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో 134పరుగులు చేసి ఔటయ్యాడు. తొలి 50 పరుగుల కోసం 152బంతులు ఆడిన సర్ఫరాజ్.. ఆ తర్వాత 38బంతుల్లోనే మరో 50పరుగులు చేశాడు.