Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్‌కు మహిళల రికర్వ్ బృందం
పారిస్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3 మహిళల రికర్వు విభాగంలో భారత బృందం ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో దీపిక కుమారి, అంకిత భగత్, సిమ్రన్‌జిత్ కౌర్ బృందం 5-3పాయింట్ల తేడాతో టర్కీని ఓడించింది. ఫైనల్లోకి దూసుకెళ్లడంతో ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. దీపిక కుమారి సారథ్యంలోని మహిళల రికర్వు జట్టు తొలిరౌండ్లో ఉక్రెయిన్‌పై 5-1(57-53, 57-54, 55-55)పాయింట్లతో గెలిచింది. క్వార్టర్ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌పై 6-0 (59-51, 59-51, 58-50) పాయింట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో టర్కీపై 5-3(56-51, 57-56, 54-55, 55-55)పాయింట్ల తేడాతో చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ఫైనల్లో టర్కీ జట్టు టాప్‌సీడ్ కొరియాను ఓడించి సెమీస్‌కు చేరింది. భారత బృందం స్వర్ణ పతకం కోసం ఆదివారం జరిగే ఫైనల్లో చైనీస్ తైపీతో తలపడనుంది.