Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లిసెస్టర్షైర్తో వార్మప్ మ్యాచ్
లిసెస్టర్: లిసెస్టర్షైర్తో గురువారం నుంచి ప్రారంభమైన వార్మప్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ శిఖర్ భరత్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్‌లో రాణించారు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి భారత్ 60.2 ఓవర్లలో 8వికెట్లు నష్టపోయి 246పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్(25), శుభ్‌మన్(21) కలిసి తొలి వికెట్‌కు 35పరుగులు జతచేశారు. ఆ తర్వాత హనుమ విహారి(3), శ్రేయస్(0), జడేజా(13) నిరాశ పరచడంతో టీమిండియా ఓ దశలో 5 వికెట్లు నష్టపోయి 81 పరుగులే చేయగల్గింది. ఆ దశలో విరాట్ కోహ్లి(33), శిఖర్ భరత్(70నాటౌట్) కలిసి 6వ వికెట్‌కు 57పరుగులు జత చేశారు. ఆ తర్వాత కోహ్లి(33) ఔటైనా.. భరత్, ఉమేశ్ కలిసి జట్టును ఆదుకున్నారు. శార్దూల్(6) కూడా బ్యాటింగ్‌లో రాణించలేకపోయాడు. ఆ తర్వాత షమీ(18నాటౌట్) భరత్‌కు తోడవ్వడంతో టీమిండియా పుంజుకుంది. వాల్కర్‌కు ఐదు, డేవిస్‌కు రెండు వికెట్లు లభించాయి. లిసెస్టర్‌షైర్ తరఫున బుమ్రా, ప్రసిధ్ కృష్ణ కూడా బౌలింగ్ చేశారు. గత ఏడాది ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య నిలిచిపోయిన చివరి టెస్ట్ జులై 1నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ఇంగ్లండ్‌తో టి20 సిరీస్...
జులై 7 : తొలి(సౌథాంప్టన్)
జులై 9 : రెండో(బర్మింగ్‌హామ్)
జులై 10: మూడో(నాటింగ్‌హామ్)
వన్డే సిరీస్...
జులై 12 : తొలి(కెన్నింగ్టన్; లండన్)
జులై 14 : రెండో(లార్డ్స్; లండన్)
జులై 17 : మూడో(మాంచెస్టర్)