Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లంకతో టి20 సిరీస్
దంబుల్లా(శ్రీలంక): శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా మహిళల జట్టు తొలి టి20లో ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 34పరుగుల తేడాతో లంకను ఓడించి మూడు టి20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యతలో నిలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(31) రాణించినా.. మంధాన(1), మేఘన(0) నిరాశపరిచారు. ఆ తర్వాత హర్మన్(22), రోడ్రిగ్స్(36) రాణించారు. రణవీరకు మూడు, రణసింఘేకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బౌలర్లు కట్టుదిట్టడంగా బౌలింగ్ చేయడంతో లంక జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 104 పరుగులే చేయగల్గింది. రాధ యాదవ్(2/22), దీప్తి(1/9), పూజ వస్త్రాకర్(1/13) షెఫాలీ(1/10) బౌలింగ్‌లో మెరిసారు. జెమీమా రోడ్రిగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా.. రెండో టి20 శనివారం జరగనుంది. ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జులై 1 నుంచి ప్రారంభం కానుంది.