Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్
హైదరాబాద్: అద్భుతమైన వేగం, గురి తప్పని గోల్స్‌తో అల్-అరబీ క్లబ్ (ఖతార్) ఆసియా పురుషుల క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన మూడో రోజు పోటీల్లో భారత క్లబ్ టీస్పోర్ట్స్పై అల్-అరబీ గెలుపొందింది.. అరబీ అటాకర్ సిమిడో ఆట ఆరంభమైన నిమిషానికే అద్భుతమైన గోల్ చేసి ఆ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అరబీ క్లబ్ తొలి అర్ధభాగాన్ని 18-8తో తిరుగులేని ఆధిక్యంతో ముగించింది. రెండో అర్ధభాగంలో టీస్పోర్ట్స్ క్లబ్ పుంజుకోవడానికి ప్రయత్నించినా అరబీ వారికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు.
ఆ జట్టు స్టార్ ప్లేయర్ లరిబి 11 గోల్స్‌తో చెలరేగడంతో అరబీ క్లబ్ 38-19 స్కోరుతో గెలుపొందింది. ఇక, అంతకు ముందు ఉత్కంఠగా సాగిన అల్-ఖద్సియా క్లబ్ (కువైట్), అల్-నూర్ (సౌదీ అరేబియా) క్లబ్ మ్యాచ్ 29-29తో టైగా ముగిసింది. అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య ఉపాధ్యక్షుడు బదర్ అల్ తీయాబ్, కువైట్ అంబాసిడర్ జాసిమ్ అల్ నజీమ్‌తో కలిసి మూడో రోజు మ్యాచులను ప్రారంభించారు.