Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : 24వ ఆసియా హ్యాండ్‌బాల్ క్లబ్ లీగ్ చాంపియన్‌షిప్ (మెన్స్) అభిమానులను అలరిస్తోంది. అగ్రజట్లు పోటీపడుతున్న లీగ్‌లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్నాయి. రసవత్తర సమరాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.
శనివారం అల్-వాక్రా (ఖతార్) క్లబ్..మెస్ కిర్మన్ (ఇరాన్) క్లబ్‌పై 25-22తో విజయం సాధించింది. అల్-నజ్మా (బహ్రెయిన్) క్లబ్ అల్-కువైట్ (కువైట్) మ్యాచ్‌లో బహ్రెయిన్ ఆటగాడు ఈద్ అలీ 12 గోల్స్‌తో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో నజ్మా 30-29తో కువైట్‌పై నెగ్గి రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఉత్తమ క్రీడాకారులుగా నిలిచిన ఇస్సా, అలీలను జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు అభినందించారు.