Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐర్లాండ్‌తో తొలి టీ20 నేడు
- హార్దిక్ పాండ్య సారథ్యంపై ఆసక్తి
- రాత్రి 9 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..
డబ్లిన్ (ఐర్లాండ్)
భారత స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జశ్‌ప్రీత్ బుమ్రా లేరు. ఈ ఏడాది ఏడో కెప్టెన్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగుతోంది. అయినా, నేడు ఐర్లాండ్‌తో తొలి టీ20పై ఆసక్తి నెలకొంది. ప్రథమ ప్రాధాన్య భారత జట్టులోనూ చోటు దక్కించుకునేందుకు బెంచ్ ఆటగాళ్లు తహతహలాడుతున్నారు. ఐర్లాండ్‌తో సిరీస్ వారికి చక్కటి వేదిక కానుంది. భారత్ వంటి అగ్రజట్టుతో సర్వశక్తులూ ఒడ్డి సమర శంఖం పూరిస్తే.. ప్రపంచ క్రికెట్‌లో తమకంటూ ఓ గుర్తింపు దక్కుతుందనే భావనలో ఆతిథ్య ఐర్లాండ్ కనిపిస్తోంది. భారత్, ఐర్లాండ్ తలపడిన గత మూడు మ్యాచుల్లోనూ టీమ్ ఇండియా ఘన విజయాలు నమోదు చేసింది. హార్దిక్ పాండ్య తొలిసారి భారత జట్టుకు సారథ్యం వహించనున్న సిరీస్‌లో ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ చీఫ్ కోచ్ బాధ్యతలు చూసుకోనున్నాడు. భారత్, ఐర్లాండ్ తొలి టీ20 నేడు. రాత్రి 9 గంటలకు మ్యాచ్ ఆరంభం.
కుర్రాళ్లకు ఛాన్స్ : సఫారీతో సిరీస్‌లో భారత జట్టుకు ఎంపికైనా.. కుర్రాళ్లకు అవకాశం దక్కలేదు. ఐపీఎల్‌లో మెరిసిన ఉమ్రాన్, అర్షదీప్, త్రిపాఠిలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్లలో కనీసం ఇద్దరికైనా నేడు అరంగేట్ర అవకాశం దక్కుతుందేమో చూడాలి. ఇక సఫారీపై ఇషాన్ కిషన్ టాప్ స్కోరర్‌గా నిలువగా.. రుతురాజ్ గైక్వాడ్ ఓ అర్థ సెంచరీతో సరిపెట్టాడు. బ్యాకప్ ప్రణాళకల్లో నిలిచేందుకు గైక్వాడ్ వరుస ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంటుంది. దీపక్ హుడా సైతం మిడిల్ ఆర్డర్‌లో తనేంటో నిరూపించుకోవాలని చూస్తున్నాడు.
ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో నిలిచిన పాల్ స్టిర్లింగ్‌ను ఎవరూ తీసుకోలేదు. పెద్ద జట్లపై అతడి పేలవ ప్రదర్శనే అందుకు కారణం. కివీస్ మినహా అన్ని జట్లపై 16 టీ20లు ఆడిన స్టిర్లింగ్ ఆకట్టుకోలేదు. తాజాగా అతడి ప్రదర్శన పేలవం. భారత్‌పై మెరిస్తే.. రానున్న ఐపీఎల్‌లోనైనా చోటు దక్కుతుందనే ఆశల పల్లకిలో స్టిర్లింగ్ ఉన్నాడు. మెగా ఇన్నింగ్స్‌లు ఆడేందుకు అతడు చూస్తున్నాడు. డబ్లిన్ సహజంగానే భారీ స్కోర్ల వేదిక. నేటి మ్యాచ్‌లో 200 పైచిలుకు స్కోర్లు నమోదు కావచ్చు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్య (కెప్టెన్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వెంద్ర చాహల్.
ఐర్లాండ్ : పాల్ స్టిర్లింగ్, ఆండీ బాల్‌బిర్నె (కెప్టెన్), గారెత్ డెలానె, కర్టిస్ కాంపెర్, హారీ టెక్టర్, లార్కోన్ టక్కర్ (వికెట్ కీపర్), జార్జ్ డాక్‌రెల్, ఆండీ మెక్‌బ్రినె, మార్క్ అడెర్, క్రెయిగ్ యంగ్, జోశ్ లిటిల్.