Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో ఇన్నింగ్స్‌లో 113/2
- మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 536/10
- రంజీ ట్రోఫీ ఫైనల్
నవతెలంగాణ-బెంగళూర్ : 41 సార్లు చాంపియన్, అగ్ర జట్టు ముంబయి ఎదురుదీతోంది. రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్‌కు 162 పరుగుల భారీ ఆధిక్యం కోల్పోయిన ముంబయి.. రెండో ఇన్నింగ్స్‌లో 113/2తో కొనసాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 113 పరుగులు చేసిన ముంబయి మరో 49 పరుగుల వెనుకంజలో నిలిచింది. కెప్టెన్ పృథ్వీ షా (44, 52 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ముంబయి రెండో ఇన్నింగ్స్‌లో దూకుడు పెంచింది. మరో ఓపెనర్ హార్దిక్ తోమరె (25, 32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌లు) సైతం ఔటైనా.. ఆర్మన్ జాఫర్ (30 నాటౌట్, 34 బంతుల్లో 3 ఫోర్లు), సువేద్ పార్కర్ (9 నాటౌట్, 14 బంతుల్లో) ఆట ముగిసే సమయానికి అజేయంగా ఆడుతున్నారు.
పటిదార్ శతకం : మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో మూడో శతకం నమోదైంది. టాప్ ఆర్డర్లో ఓపెనర్ యశ్ దూబె (133), శుభమ్ శర్మ (116) అనంతరం మిడిల్ ఆర్డర్లో రజత్ పటిదార్ (122, 219 బంతుల్లో 20 ఫోర్లు) శతకంతో చెలరేగాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో మెరుపు శతకంతో అందరి దృష్టిని ఆకర్షించిన రజత్ పటిదార్.. సీజన్లో రెండో శతకం సాధించాడు. 20 ఫోర్లు బాదిన రజత్ పటిదార్ టెయిలెండర్లలో కలిసి ముంబయి బౌలర్లను విసిగించాడు. సారాన్షు జైన్ (57, 97 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీతో ముంబయి కష్టాలు రెట్టింపు అయ్యాయి. 177.2 ఓవర్లలో 536 పరుగుల భారీ స్కోరు వద్ద మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ముంబయి బౌలర్ శామ్ ములాని (5/173) ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. తుషార్ దేశ్‌పాండే (3/116), మోహిత్ అవస్తి (2/93) వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగుల భారీ ఆధిక్యం సొంతం చేసుకున్న మధ్యప్రదేశ్.. రంజీ ట్రోఫీని ముద్దాడేందుకు రంగం సిద్ధం చేసుకుంది. నేడు చివరి రోజు ఆటలో ముంబయి లోటు అధిగమించటంతో పాటు మధ్యప్రదేశ్‌కు సవాల్ విసిరే లక్ష్యాన్ని నిర్దేశించాలి. మరో 98 ఓవర్ల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి మధ్యప్రదేశ్ మ్యాచ్‌పై తిరుగులేని పట్టు సాధించింది. విధ్వంసక ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైన ముంబయి.. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ వంటి హిట్టర్లతో తొలి సెషన్లోనే పరుగుల వరద పారించి.. మధ్యప్రదేశ్‌కు ఛేదన సవాల్ విసురుతుందేమో చూడాలి.
స్కోరు వివరాలు :
ముంబయి తొలి ఇన్నింగ్స్ : 374/10
మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ : 536/10
ముంబయి రెండో ఇన్నింగ్స్ : పృథ్వీ షా (సి) దూబె (బి) గౌరవ్ యాదవ్ 44, హార్దిక్ తోమరె (బి) కార్తికేయ కుమార్ 25, ఆర్మన్ జాఫర్ నాటౌట్ 30, సువేద్ పార్కర్ నాటౌట్ 9, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం :(22 ఓవర్లలో 2 వికెట్లకు) 113.
వికెట్ల పతనం : 1-63, 2-83.
బౌలింగ్ : కుమార్ కార్తికేయ 10-1-50-1, అనుభవ్ అగర్వాల్ 6-0-32-0, గౌరవ్ యాదవ్ 5-0-23-1, పార్థ్ సహాని 1-0-6-0.