Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో ముంబయిపై ఘన విజయం
- తొలిసారి రంజీ ట్రోఫీ ముద్దాడిన ఎంపీ
బెంగళూర్ : 23 ఏండ్ల క్రితం రంజీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక చేతిలో ఓటమి చవిచూసిన మధ్యప్రదేశ్.. మళ్లీ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ తుది పోరుకు అర్హతే సాధించలేదు. 23 ఏండ్ల క్రితం మధ్యప్రదేశ్ రంజీ టైటిల్ వేటలో భంగపడిన చంద్రకాంత్ పండిట్..తాజాగా కోచ్‌గా మధ్యప్రదేశ్‌ను తొలిసారి రంజీ చాంపియన్‌గా నిలిపాడు. 41సార్లు చాంపియన్ ముంబయిని అన్ని రంగాల్లోనూ చిత్తు చేసిన మధ్యప్రదేశ్.. తిరుగులేని ప్రదర్శనతో రంజీ ట్రోఫీని ఎత్తుకుంది. 108 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 29.5 ఓవర్లలోనే ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో శతక హీరో శుభమ్ శర్మ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలువగా, టోర్నీలో ఏకంగా 982 పరుగులు సాధించిన ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు.
ముంబయి రెండో ఇన్నింగ్స్‌లో 269 పరుగులకే కుప్పకూలింది. సువేద్ పార్కర్ (51, 58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (45, 48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో ముంబయి తొలి ఇన్నింగ్స్ లోటు (162) అధిగమించి.. మధ్యప్రదేశ్‌కు లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. యశస్వి జైస్వాల్ (1) నిరాశపరిచాడు. ఇక, 108 పరుగుల స్వల్ప ఛేదనలో హిమాన్షు మంత్రి (37), శుభమ్ శర్మ (30), రజత్ పటిదార్ (30 నాటౌట్) రాణించటంతో మధ్యప్రదేశ్ అలవోకగా ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో ముంబయిపై ఘన విజయం సాధించింది. రంజీ ట్రోఫీ చరిత్రలో మధ్యప్రదేశ్ చాంపియన్‌గా నిలువటం ఇదే ప్రథమం.
స్కోరు వివరాలు :
ముంబయి తొలి ఇన్నింగ్స్ : 374
మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ : 536
ముంబయి రెండో ఇన్నింగ్స్ : 269
మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్ : 108/4