Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : ఇంగ్లాండ్ క్రికెట్ అత్యంత విజయవంతమైన సారథి, 2019 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ విజయ నాయకుడు ఇయాన్ మోర్గాన్ నాయకత్వ బాధ్యతలను నుంచి తప్పుకోనున్నాడు!. కొంతకాలంగా పేలవ ఫామ్‌లో ఉన్న ఇయాన్ మోర్గాన్‌ను వరుస గాయాలు సైతం ఇబ్బందికి గురి చేస్తున్నాయి. నెదర్లాండ్‌పై తొలి రెండు వన్డేల్లో డకౌట్‌గా నిష్క్రమించిన మోర్గాన్.. గాయంతో మూడో వన్డేకు దూరమయ్యాడు. 2021, జనవరి 1 నుంచి ఐదు వన్డేల్లో 25.75 సగటుతో 103 పరుగులు చేసిన మోర్గాన్.. 43 టీ20ల్లో 17.86 సగటుతో 643 పరుగులు చేశాడు. వన్డేల్లో స్ట్రయిక్‌రేట్ 74.63 కాగా, టీ20ల్లో 116.27గా ఉంది. వన్డేల్లో అత్యధిక స్కోరు 75, టీ20ల్లో 47 చేశాడు. పేలవ ఫామ్‌తో జట్టుకు భారమైనట్టు భావిస్తున్న ఇయాన్ మోర్గాన్ నేడు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పనన్నట్టు సమాచారం. ఇదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమణ ప్రకటన వెలువడే అవకాశం లేకపోలేదని వార్తలు వస్తున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో ఇయాన్ మోర్గాన్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.