Authorization
Mon Jan 19, 2015 06:51 pm
3-0తో కివీస్‌పై టెస్టు సిరీస్ కైవసం
లీడ్స్ : వరుసగా చివరి 17 టెస్టుల్లో దారుణ వైఫల్యాలు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దిగజారిన స్థానం. జట్టు చెత్త ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి జో రూట్ రాజీనామా. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ శిబిరంలో ఏదీ నిలకడగా లేదు. డ్రెస్సింగ్‌రూమ్‌లో నూతన నాయకత్వం. బెన్‌స్టోక్స్, బ్రెండన్ మెక్‌కలమ్ కాంబినేషన్ ఇంగ్లాండ్‌కు గొప్ప విజయాన్ని కట్టబెట్టింది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్ న్యూజిలాండ్‌పై 3-0 క్లీన్‌స్వీప్ విజయం ఇంగ్లాండ్ సొంతమైంది. చివరిదైన లీడ్స్ టెస్టులో న్యూజిలాండ్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 54.2 ఓవర్లలో ఊదేసింది. జో రూట్ (86 నాటౌట్, 125 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), ఒలీ పోప్ (82, 108 బంతుల్లో 12 ఫోర్లు) సహా జానీ బెయిర్‌స్టో (71 నాటౌట్, 44 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ షోతో ఇంగ్లాండ్ అలవోక విజయం సాధించింది. న్యూజిలాండ్ వరుస ఇన్నింగ్స్‌ల్లో 329, 326 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 360 పరుగులు సాధించింది. పది వికెట్లు కూల్చిన జాక్ లీచ్ (5/100, 5/66) 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలువగా.. కివీస్ బ్యాటర్ డార్లీ మిచెల్ (538 పరుగులు), ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (396 పరుగులు, 1 వికెట్) 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును పంచుకున్నారు.