Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శతకంతో చెలరేగిన యువ బ్యాటర్
- ఐర్లాండ్‌పై భారత్ 227/7
డబ్లిన్ (మలాహిడె) : భారత యువ బ్యాటర్ దీపక్ హుడా (104, 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) ధనాధన్ మోత మోగించాడు. ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొమ్మిది ఫోర్లు, ఆరు సిక్సర్లతో టీ20 కెరీర్ తొలి శతకం బాదాడు. 55 బంతుల్లోనే సెంచరీ సాధించిన దీపక్ హుడా.. టీ20 ఫార్మాట్లో శతకం సాధించిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు. భారత్ తరఫున రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సురేశ్ రైనాలు శతకాలు నమోదు చేశారు. దీపక్ హుడాకు తోడు సంజు శాంసన్ (77, 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగటంతో ఐర్లాండ్‌తో రెండో టీ20లో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 227 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే ఓపెనర్ ఇషాన్ కిషన్ (3)ను కోల్పోయింది. దీపక్ హుడా, సంజు శాంసన్ విధ్వంసం అక్కడి నుంచి ఆరంభమైంది. రెండో వికెట్‌కు రికార్డు 176 పరుగులు జోడించారు. టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. పవర్‌ప్లే ముగిసే సమయానికి 54/1తో సాధారణంగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు ఆ తర్వాతే ఊపోచ్చింది. దీపక్ హుడా మొదలెట్టిన ధనాధన్ షోలో సంజు శాంసన్ చేరాడు.27 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన దీపక్ హుడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 బంతుల్లో సంజు శాంసన్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హుడా, సంజు వికెట్‌కు అన్ని వైపులా బౌండరీలు బాదారు. సూర్యకుమార్ (15), హార్దిక్ పాండ్య (13 నాటౌట్, 9 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. దినేశ్ కార్తీక్ (0), అక్షర్ పటేల్ (0), హర్షల్ పటేల్ (0) డకౌట్‌గా నిష్క్రమించారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ ఎడెర్ (3/42), జోశ్ లిటిల్ (2/38), క్రెయిగ్ యంగ్ (2/35) వికెట్లు తీసుకున్నారు.