Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ మూడోరౌండ్‌కు చేరుకున్నాడు. మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్లో కొక్కినాకిస్ (ఆస్ట్రేలియా)పై 6-1, 6-4, 6-2తో వరుస సెట్లలో విజయం సాధించాడు. మూడో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6-3, 2-6, 5-7, 4-6తో యుగో హంబర్ట్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి పాలయ్యాడు. డెవిడ్ గాఫిన్ (బెల్జియం) 6-1, 6-2, 6-4తో సెబాస్టియన్‌పై అలవోక విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ అనెట్ కొంటావిట్ (ఈస్టోనియా) కథ ముగిసింది. 4-6, 0-6తో జులె నీమీర్ (జర్మనీ) చేతిలో దారుణ పరాజయం చవిచూసింది. జెలెనా ఒస్టాపెంకో (లాతివా) 6-2, 6-2తో వరుస సెట్లలో విక్‌మేయర్ (బెల్జియం)పై విజయం సాధించి మూడో రౌండ్లోకి ప్రవేశించింది.