Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి ప్రాంఛైజీ బాద్షా, పునీత్ బాలన్ సొంతం
న్యూఢిల్లీ : గ్రామీణ క్రీడ ఖోఖో సరికొత్త రూపంలో కనువిందు చేసేందుకు ముస్తాబవుతోంది. అల్టీమేట్ ఖోఖో లీగ్‌లో అప్పటికే కార్పోరేట్ సంస్థలు ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. తాజాగా బాలీవుడ్ గ్లామర్ సైతం ఈ లీగ్‌కు తోడైంది. బాలీవుడ్ గాయకుడు బాద్షా, సినీ నిర్మాత పునీత్ బాలన్‌లు ఖోఖో లీగ్ ముంబయి ప్రాంఛైజీలో భాగస్వామ్యులు అయిపోయారు. తెలంగాణ జట్టును జిఎంఆర్ గ్రూప్, గుజరాత్ జట్టును అదానీ గ్రూప్‌లు ఇదివరకే దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆఖర్లో తొలి సీజన్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్న అల్టీమేట్ ఖోఖో లీగ్ మహారాష్ట్రలో మరింత ఆదరణ పొందేందుకు అడుగులు వేస్తోంది. ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా క్రీడల్లో మహారాష్ట్ర నుంచి ఏకంగా మూడు జట్లు బరిలో నిలిచాయి. రెండు విభాగాల్లో (బాలురు, బాలికలు) మహారాష్ట్ర విజేతగా నిలిచింది. ఖోఖో లీగ్‌తో ఈ క్రీడను పట్టణ ప్రాంతాల్లోనూ పాపులర్ చేయటమే లక్ష్యమని ముంబయి ప్రాంఛైజీ దక్కించుకున్న బాద్షా, పునీత్ బాలన్ తెలిపారు. సోనీ నెట్‌వర్క్‌తో ఖోఖో లీగ్ ఇప్పటికే ప్రసార హక్కుల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.