Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్ పోరులో అల్ నజ్మాపై గెలుపు
హైదరాబాద్: 24వ ఆసియా హ్యాండ్బాల్ క్లబ్ లీగ్ చాంపియన్షిప్ (మెన్స్) టైటిల్ను అల్ కువైట్ క్లబ్ కైవసం చేసుకుంది. గచ్చిబౌలి స్టేడియంలో గురువారం జరిగిన టైటిల్ పోరులో 28-23తో అల్ నజ్మా (బహ్రెయిన్)ను ఓడించి అల్ కువైట్ ట్రోఫీని ముద్దాడింది. కువైట్ 15-11తో ప్రథమార్థంలో ఆధిక్యం సాధించింది. విరామం అనంతరం పుంజుకున్న అల్ నజ్మా స్కోరు సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఓ దశలో 18-20తో గట్టి పోటీ ఇచ్చి. చివర్లోనూ అల్ కువైట్ దూకుడు కొనసాగటంతో ఆ జట్టు 28-23తో అలవోక విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో అల్ అరబీ (ఖతార్)పై అల్ ఖద్సియా (కువైట్) 28-27తో గెలుపొందింది. రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, యువజన సర్వీసులు, క్రీడల శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, అంతర్జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య ఉపాధ్యక్షుడు బదర్ అల్ తీయాబ్, జాతీయ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్రావు, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, భారత ఒలింపిక్ సంఘం కోశాధికారి ఆనందీశ్వర్ పాండేలు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ' ఆసియా హ్యాండ్బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించటంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువలేనిది. త్వరలోనే రాష్ట్రంలో మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ నిర్వహణకు ఆలోచన చేస్తున్నాం. సారు, శాట్స్, హ్యాండ్బాల్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలని' అని జగన్మోహన్రావు తెలిపారు.