Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్‌లో సింధు, ప్రణరు ఓటమి
- మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్
కౌలాలంపూర్ : మలేషియా ఓపెన్ (సూపర్ 750 సిరీస్)లో భారత షట్లర్ల పోరాటానికి తెరపడింది. వరుస విజయాలతో టైటిల్‌పై ఆశలు రేపిన స్టార్ షట్లర్లు పి.వి సింధు, హెచ్.ఎస్ ప్రణరు క్వార్టర్ఫైనల్లో తడబాటుకు లోనయ్యారు. మహిళల సింగిల్స్‌లో సింధు, పురుషుల సింగిల్స్‌లో ప్రణరు పరాజయంతో మలేషియా ఓపెన్‌లో భారత పోరాటం ముగిసింది. ఏడో సీడ్ పి.వి సింధు ప్రియ ప్రత్యర్థి తైజు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. 53 నిమిషాల మూడు గేముల పోరులో భారత స్టార్ 1-3తో సెమీస్ బెర్త్‌కు దూరమైంది. తొలి గేమ్‌లో 21-13తో గెలుపొందిన సింధు.. తర్వాతి గేమ్‌లో నిరాశపరిచింది. 15-21, 13-21తో తైజు యింగ్ దూకుడుకు తలొంచింది. వరల్డ్ నం.2 తైజు యింగ్‌కు సింధుపై 16వ విజయం కావటం గమనార్హం. ఇక పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్ ప్రణరు అంచనాలను అందుకోలేదు. ప్రీ క్వార్టర్స్‌లో వరల్డ్ నం.4ను చిత్తు చేసిన ప్రణరు.. క్వార్టర్స్‌లో వరల్డ్ నం.7 జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. 44 నిమిషాల మ్యాచ్‌లో 18-21, 16-21తో ప్రణరు టోర్నీ నుంచి నిష్క్రమించాడు.