Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుమ్రా ప్రపంచ రికార్డు భారత్ 416ఆలౌట్
బర్మింగ్‌హామ్: ఐదో టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. శనివారం రెండోరోజు రవీంద్ర జడేజా సెంచరీకి తోడు, కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సూపర్ ఇన్నింగ్స్ తోడవ్వడంతో టీమిండియా 416పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 7 వికెట్ల నష్టానికి 338పరుగులతో రెండోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియా లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రవీంద్ర జడేజా(104; 194బంతుల్లో 13ఫోర్లు) శతకం బాదాడు. షమి(16)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 48 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 80వ ఓవర్ చివరి బంతికి షమి షాట్‌పిచ్ బంతిని గాల్లోకి ఆడి క్రాలే చేతికి చిక్కాడు. దీంతో టీమ్ఇండియా 371 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కాసేపటికే జడ్డూ సైతం అండర్సన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 375/9గా నమోదైంది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య ఇంగ్లండ్ 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ లీస్ ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ జాక్ క్రాలే (7 బ్యాటింగ్), ఓలీ పోప్ (0 బ్యాటింగ్) ఉన్నారు. కాగా, రెండరోజు ఆట ఆరంభంలో టీమిండియా ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. ఓవర్ నైట్ స్కోరు 338/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా... వేగంగా ఆడింది. ఈ క్రమంలో జడేజా సెంచరీ పూర్తి చేసుకోగా, తాత్కాలిక సారథి బుమ్రా (31 నాటౌట్) బ్యాట్ తో రెచ్చిపోవడం హైలైట్ గా నిలిచింది. బుమ్రా 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లు బాదాడు. అంతకుముందు సెంచరీ పూర్తి చేసుకున్న జడేజా (104) ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. షమీ 16 పరుగులు చేయగా, సిరాజ్ 1 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో అవుటయ్యాడు. అంతకుముందు తొలిరోజు టీమ్ఇండియా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగగా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సయమంలో రిషభ్ పంత్ (146బీ 111 బంతుల్లో 20%ఞ4, 4ఞ%6), జడేజా ఆరో వికెట్‌కు 222 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇలా టీమ్ఇండియా టెస్టుల్లో 100లోపే ఐదు వికెట్లు కోల్పోయాక 400 పైచిలుకు పరుగులు చేయడం ఇది మూడోసారి. ఈ వికెట్ కూడా ఆండర్సన్ ఖాతాలో చేరింది. ఈ మ్యాచ్ లో ఆండర్సన్ 5 వికెట్లు తీశాడు. ఇతర ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్ 2, బ్రాడ్ 1, స్టోక్స్ 1, రూట్ 1 వికెట్ పడగొట్టారు.
బుమ్రా ప్రపంచ రికార్డు..
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్‌లోనూ మెరిసాడు. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో ఏకంగా వ్యక్తిగతంగా 29పరుగులు, అదనంగా మరో 6పరుగులు రావడంతో మొత్తమ్మీద 35పరుగులతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. (31నాటౌట్; 16బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) టెస్టుల్లో ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. బ్రాడ్ వేసిన 84వ ఓవర్లో ఏకంగా 35పరుగులు చేసి టెస్టుల్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆ ఓవర్లో (4, 5వైడ్లు, 6(నోబాల్), 4, 4, 4, 6, 1) కొట్టడంతో 35 పరుగులు వచ్చాయి. దీంతో టెస్టుల్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే వ్యక్తిగతంగా ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ టెండూల్కర్ ఒక ఓవర్లో 28 పరుగులు చేస్తే.. బుమ్రా 29పరుగులు చేసి ఆ రికార్డును బ్రేక్ చేయడం విశేషం. అయితే, అండర్సన్ వేసిన మరుసటి ఓవర్ ఐదో బంతికి సిరాజ్(2) ఔటవ్వడంతో టీమిండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో చివరికి భారత్ 416 పరుగులకు ఆలౌటైంది.
బుమ్రా బ్రేక్ చేసిన రికార్డులివీ...
2013లో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో ఆడిన సందర్భంగా 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియా చివరికి 453 పరుగులు చేసింది.
అంతకుముందు 1983లో చెన్నై వేదికగా వెస్టిండీస్ జట్టుతోనే తలపడిన సందర్భంగా 92 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. అప్పుడు చివరికి 451 పరుగులు చేసింది.
ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు..
బుమ్రా 35 పరుగులు.. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఇదే మ్యాచ్‌లో.
బ్రియాన్ లారా 28 పరుగులు.. 2003లో జోహెనస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్ పీటర్సన్ బౌలింగ్‌లో.
బెయిలీ 28 పరుగులు.. 2013లో పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో.
కేశవ్ మహారాజ్ 28 పరుగులు.. 2020లో పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జోరూట్ బౌలింగ్‌లో.