Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఇంగ్లండ్‌తో తలపడనున్న భారత్
- మహిళల హాకీ ప్రపంచకప్
ఆమ్స్టెర్డ్యామ్(నెదర్లాండ్స్): మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఆదివారం తొలి మ్యాచ్‌ను ఆడనుంది. టోక్యో ఒలింపిక్స్ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ గాయం కారణంగా టోర్నమెంట్‌కు దూరం కావడంతో గోల్ కీపర్ సవిత పునియా పగ్గాలు అందుకుంది. వైస్ కెప్టెన్‌గా డిఫెండర్ దీప్ గ్రేస్ ఎక్కా వ్యవహఱించనుంది. పూల్-బిలో ఉన్న భారత్ తన తొలి మ్యాచ్‌ను నేడు ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఇదే గ్రూప్‌లో న్యూజిలాండ్, చైనా జట్లు కూడా ఉన్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉన్న భారత్ 13వ ర్యాంకర్ చైనాతో జులై 5న, న్యూజిలాండ్‌తో 7న తలపడనుంది. ప్రతి గ్రూప్‌లో టాప్‌లో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు ప్రవేశించనుండగా.. 2, 3 స్థానాల్లో నిలిచిన జట్లు మిగతా జట్లతో నాకౌట్ మ్యాచ్ మ్యాచ్‌లు ఆడి క్వార్టర్‌ఫైనల్ బెర్త్‌కు వెళ్లనున్నాయి. ఫేజ్-2 పోటీలకు స్పెయిన్ ఆతిథ్యమివ్వనుంది. జులై 18న జరిగే ఫైనల్ ఎస్టాడి ఒలింపిక్ స్టేడియంలో జరగనుంది. 1974న ఫ్రాన్స్ వేదికగా ప్రారంభమైన ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన నాల్గోస్థానంలో నిలవడమే.