Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్‌ను జయించిన హిట్‌మ్యాన్
సౌతాంప్టన్ : భారత కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కరోనా వైరస్‌ను జయించాడు!. లిసెస్టర్తో వార్మప్ మ్యాచ్ సందర్భంగా కోవిడ్-19 బారిన పడిన రోహిత్ శర్మ అనంతరం కీలక పటౌడీ ట్రోఫీలో చివరి టెస్టుకు దూరమయ్యాడు. రోహిత్ శర్మ కోసం ఆఖరు వరకు ఎదురుచూసిన జట్టు మేనేజ్మెంట్.. మ్యాచ్‌కు ముందు రోజు సైతం అతడు రెండు సార్లు ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలటంతో ప్రత్యామ్నాయ అవకాశాలను అన్వేషించింది. కెప్టెన్‌గా జశ్‌ప్రీత్ బుమ్రాను ఎంచుకుని, ఓపెనర్ స్థానాన్ని చతేశ్వర్ పుజారాక అప్పగించింది. తాజాగా రోహిత్ శర్మ కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ టెస్టులో రెండు సార్లు నెగెటివ్‌గా తేలాడు. దీంతో జులై 7న ఇంగ్లాండ్‌తో సౌతాంప్టన్ తొలి టీ20కి రోహిత్ శర్మ అందుబాటులో ఉండనున్నాడు. ' అవును, రోహిత్ శర్మ కోవిడ్ నెగెటివ్‌గా వచ్చాడు. బ్రిటన్ వైద్య నిబంధనల ప్రకారం క్వారంటైన్ నుంచి బయటకు రావచ్చు. అయినప్పటికీ, అతడు ఈ రోజు వార్మప్ మ్యాచ్‌లో ఆడటం లేదు. తొలి టీ20కి ముందు కాస్త విశ్రాంత సమయం, ప్రాక్టీస్ అవసరం' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టు రోజు ఉదయం రోహిత్ శర్మకు మూడు సార్లు కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేశారు. ఆ మూడింటిలోనూ రోహిత్ శర్మ పాజిటివ్‌గా తేలాడు. టెస్టు మ్యాచ్‌లో ఆడుతున్న విరాట్ కోహ్లి, జశ్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు తొలి టీ20కి విశ్రాంతి తీసుకోనున్నారు.