Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టే ఆర్డర్‌కు హైకోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో సీనియర్ అడ్మినిస్ట్రేటర్ నరెందర్ ధ్రువ్ బత్రాకు మరో షాక్ తగిలింది. భారత హాకీ సమాఖ్యలో రూ. 32 లక్షల గోల్‌మాల్‌కు సంబంధించి సీబీఐ కేసు ఎదుర్కొంటున్న నరెందర్ బత్రా.. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడానికి వీల్లేదని సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై స్టే ఆర్డర్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియంలతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. ' ఎటువంటి నిలుపుదల ఆదేశాలను జారీ చేయటం లేదు. సాంకేతిక అంశాలపై నోటీసులు మాత్రం ఇస్తున్నాం' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భారత హాకీ సమాఖ్యలో జీవిత కాల సభ్యుడు, జీవిత కాల అధ్యక్షుడిగా నరెందర్ బత్రా పదవిని సవాల్ చేస్తూ ఒలింపియన్, హాకీ ప్రపంచకప్ విజేత అస్లాం షేర్ ఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ విచారణ సందర్భంగానే నరెందర్ బత్రా జీవిత కాల సభ్యత్యాన్ని రద్దు చేసిన హైకోర్టు, భారత ఒలింపిక్ సంఘంలో అధ్యక్ష బాధ్యతల నుంచి అతడిపై వేటు వేసింది. ఆ ఆదేశాలపై బత్రా న్యాయవాదులు నిలుపుదల ఆదేశాలు కోరగా.. ద్వి సభ్య ధర్మాసనం నిరాకరించిం ది. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా.. తొలుత నరెందర్ బత్రా ఐఓఏ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునేందుకు మొండికేశాడు. ఐఓఏ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించే ప్రయత్నం చేశాడు. దీంతో కోర్టు ధిక్కరణ వ్యాజ్యంతో అస్లాం షేర్ ఖాన్ మరోసా రి హైకోర్టును ఆశ్రయించాడు. ధిక్కరణ కేసు ఆగస్టు 2న విచారణకు రానుండగా.. బత్రా పిటిషన్‌పై జులై 26న తదుపరి వాదనలు వినున్నారు.