Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఉత్కంఠగా ఎడ్బాస్టన్ టెస్టు
- ఇంగ్లాండ్ లక్ష్యం 378, ప్రస్తుతం 200/7
పటౌడీ ట్రోఫీ నిర్ణయాత్మక టెస్టు రసకందాయంలో పడింది!. తొలి మూడు రోజులు టీమ్ ఇండియా తిరుగులేని ఆధిపత్యం చెలాయించగా.. నాల్గో రోజు ఆతిథ్య ఇంగ్లాండ్ రేసులోకి దూసుకొచ్చింది. చతేశ్వర్ పుజారా (66), రిషబ్ పంత్ (57) అర్థ సెంచరీలతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 245 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌కు 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి సవాల్ విసిరింది. ఇంగ్లాండ్ ధనాధన్ దూకుడు చూపించటంతో ఎడ్జ్‌బాస్టన్ సమరం ఉత్కంఠభరితంగా మారింది.
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్
భారత్, ఇంగ్లాండ్ చివరి టెస్టు ఆసక్తిగా సాగుతోంది. తొలి మూడు రోజులు పర్యాటక జట్టు ప్రతాపం చూపించగా.. నాల్గో రోజు ఆతిథ్య జట్టు నిద్ర లేచింది!. 378 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైట్‌బాల్ ఫార్మాట్ ఫార్ములా అనుసరిస్తూ దూకుడుగా ఆడుతోంది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 245 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ చతేశ్వర్ పుజారా (66, 168 బంతుల్లో 8 ఫోర్లు), వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (57, 86 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. విరాట్ కోహ్లి (20), శ్రేయస్ అయ్యర్ (19) మళ్లీ నిరాశపరిచారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (4/33) నాలుగు వికెట్ల ప్రదర్శనతో రాణించాడు.
రాణించిన పుజారా, పంత్ : టీమ్ ఇండియా కీలక బ్యాటర్లు వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచారు. ఓవర్‌నైట్ స్కోరు 125/3తో నాల్గో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ ఇండియా.. 245 పరుగులకే కథ ముగించింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు పుజారా (50), రిషబ్ పంత్ (30)లు నాల్గో రోజు పెద్దగా రాణించలేదు. ఈ ఇద్దరూ క్రీజులో ఉండటంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 300 పైచిలుకు పరుగులు ఆశించింది. కానీ ఓవర్‌నైట్ అర్థ సెంచరీ హీరో పుజారా తొలుత క్రీజు వదలగా.. రిషబ్ పంత్ అర్థ సెంచరీ అనంతరం వికెట్ కోల్పోయాడు. ఏడు ఫోర్లతో 76 బంతుల్లో అర్థ శతకం సాధించిన రిషబ్ పంత్ లోయర్ ఆర్డర్‌తో కలిసి అనుకున్న మాయ చేయలేదు. రవీంద్ర జడేజా (23, 58 బంతుల్లో 1 ఫోర్) కాసేపు నిలిచినా.. టెయిలెండర్ల నుంచి తగిన సహకారం లభించలేదు. శార్దుల్ ఠాకూర్ (4), మహ్మద్ షమి (13), జశ్‌ప్రీత్ బుమ్రా (7)లు నిరాశపరిచారు. 81.5 ఓవర్లలో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో పది వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్ రెండేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
ఇంగ్లాండ్ దూకుడు : ఇంగ్లాండ్ మరో భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దూకుడుగా సాగుతోంది!. న్యూజిలాండ్‌పై వరుసగా మూడు టెస్టుల్లో లక్ష్యాలను ఛేదించిన ఇంగ్లాండ్.. భారత్‌పైనా అదే పునరావృతం చేయాలని చూస్తోంది. కివీస్‌పై వరుసగా 296 (7 వికెట్ల తేడాతో), 299 (5 వికెట్ల తేడాతో), 277 (5 వికెట్ల తేడాతో) పరుగుల లక్ష్యాలను ఇంగ్లాండ్ విజయవంతంగా ఛేదించింది. ఇక, తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన టాప్ ఆర్డర్ ఛేదనలో చెలరేగింది. ఓపెనర్లు అలెక్స్ లీస్ (56, 65 బంతుల్లో 8 ఫోర్లు), జాక్ క్రావ్లీ (46, 76 బంతుల్లో 7 ఫోర్లు) ధనాధన్ మోత మోగించారు. తొలి వికెట్‌కు 21.4 ఓవర్లలోనే 100 పరుగులు జోడించారు. ధనాధన్ ఆరంభం సాధించిన ఇంగ్లాండ్.. అంతే వేగంగా తొలి మూడు వికెట్లు కోల్పోయింది. బుమ్రాకు క్రావ్లీ, ఒలీ పోప్ (0) దొరికిపోగా.. అలెక్స్ లీస్ రనౌట్‌గా నిష్క్రమించాడు. దీంతో 107/0తో ఉన్న ఇంగ్లాండ్.. 109/3తో ఒత్తిడిలో పడింది. ఇక్కడ్నుంచి జో రూట్ (43 నాటౌట్), జానీ బెయిర్‌స్టో (22 నాటౌట్) మరో వికెట్ పడకుండా ఆడుతున్నారు. 40 ఓవర్లలో ఇంగ్లాండ్ 174/3తో పోరాడుతోంది.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 416
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 245
భారత్ రెండో ఇన్నింగ్స్ : గిల్ (సి) క్రావ్లీ (బి) అండర్సన్ 4, పుజారా (సి) అలెక్స్ (బి) బ్రాడ్ 66, విహారి (సి) బెయిర్‌స్టో (బి) బ్రాడ్ 11, కోహ్లి (సి) రూట్ (బి) స్టోక్స్ 20, పంత్ (సి) రూట్ (బి) లీచ్ 57, శ్రేయస్ (సి) అండర్సన్ (బి) పాట్స్ 19, జడేజా (బి) స్టోక్స్ 23, శార్దుల్ (సి) క్రావ్లీ (బి) పాట్స్ 4, షమి (సి) అలెక్స్ (బి) స్టోక్స్ 13, బుమ్రా (సి) క్రావ్లీ (బి) స్టోక్స్ 7, సిరాజ్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 19, మొత్తం :(81.5 ఓవర్లలో ఆలౌట్) 245.
వికెట్ల పతనం : 1-4, 2-43, 3-75, 4-153, 5-190, 6-198, 7-207, 8-230, 9-236, 10-245.
బౌలింగ్ : అండర్సన్ 19-5-46-1, స్టువర్ట్ బ్రాడ్ 16-1-58-2, మాథ్యూ పాట్స్ 17-3-50-2, జాక్ లీచ్ 12-1-28-1, బెన్ స్టోక్స్ 11.5-0-33-4, జో రూట్ 6-1-17-0.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : అలెక్స్ లీస్ (రనౌట్) 56, జాక్ క్రావ్లీ (బి) బుమ్రా 46, ఒలీ పోప్ (సి) పంత్ (బి) బుమ్రా 0, జో రూట్ 43 నాటౌట్, జానీ బెయిర్‌స్టో 22 నాటౌట్, ఎక్స్‌ట్రాలు : 07, మొత్తం : (40 ఓవర్లలో 3 వికెట్లకు) 174.
వికెట్ల పతనం : 1-107, 2-107, 3-109, 4-
బుమ్రా 9-0-34-2, మహ్మద్ షమి 9-2-33-0, జడేజా 12-2-44-0, సిరాజ్ 7-0-42-0, శార్దుల్ ఠాకూర్ 3-0-15-0.