Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి మాజీ టాప్‌సీడ్ క్రీడాకారిణి, రొమేనియాకు చెందిన సిమోనా హలెప్, కజకిస్తాన్‌కు చెందిన ఎలెనా రైబకినా ప్రవేశించారు. బుధవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో 16వ సీడ్ హలెప్ 20వ సీడ్ అమెరికాకు చెందిన అనిషిమోవాపై వరుససెట్లలో గెలుపొందగా.. రైబకినా మూడుసెట్ల హౌరాహౌరీ పోరులో టోంజనొవిక్(ఆస్ట్రేలియా)పై పోరాడి నెగ్గింది. హలెప్ 6-2, 6-4తో అనిషిమోవాను వరుససెట్లలో చిత్తుచేసింది. ఇక 17వ సీడ్ రైబకినా 4-6, 6-2, 6-3తో టోంజనొవిక్పై చెమటోడ్చాల్సి వచ్చింది. తొలి సెట్‌ను కోల్పోయిన రైబకినా ఆ తర్వాత వరుసగా మూడుసెట్లను గెలుపొంది సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్ పోటీలు గురువారం, పురుషుల సింగిల్స్ సెమీస్ పోటీలు శుక్రవారం జరగనున్నాయి.
ఇక పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి 9వ సీడ్ నొర్రి(బ్రిటన్) ప్రవేశించాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ఫైనల్లో కేమరోన్ నొర్రి ఐదుసెట్ల హౌరాహౌరీ పోరులో గొఫిన్(జర్మనీ)పై పోరాడి నెగ్గాడు. నొర్రి 3-6, 7-5, 2-6, 6-3, 7-5తో గొఫిన్‌ను చిత్తుచేశాడు.