Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోహిత్, కోహ్లి, పంత్, బుమ్రాకు విశ్రాంతి
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన బిసిసిఐ
ముంబయి: ఈ నెలాఖరులో జరగబోయే వెస్టిండీస్-భారత్ వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కెప్టెన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలకు వెస్టిండీస్ సిరీస్‌లో విశ్రాంతినిచ్చారు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు మరోసారి వన్డే జట్టు నుంచి పిలుపొచ్చింది. అతను చివరగా 2020 డిసెంబరులో భారత్ తరఫున అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాడు. అలాగే, వెస్టిండీస్ పర్యటనలో వెటర్ ఓపెనర్ శిఖర్ ధావన్.. భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్‌గా నియమించినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటన కోసం మొత్తం 16 మందితో జట్టును ప్రకటించింది.
జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్(వికెట్ కీపర్లు), శార్దూల్ ఠాకూర్, చాహల్, అక్షర్ పటేల్, ఆవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, ఆర్ష్‌దీప్ సింగ్.
షెడ్యూల్
జులై 22 : తొలి వన్డే
జులై 24 : రెండో వన్డే
జులై 27 : మూడో వన్డే
(వేదిక: పోర్ట్ ఆఫ్ స్పెయిన్)