Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరోకియా స్థానంలో...
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత హైజంపర్ తేజశ్విన్ శంకర్‌కు చోటు దక్కింది. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఎఫ్ఐ) బుధవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఎఎఫ్ఐ కామన్వెల్త్ గేమ్స్‌కు తొలుత ప్రకటించిన 36మంది జట్టులో తేజశ్విన్కు చోటు దక్కలేదు. అతని స్థానంలో అరోకియా రాజీవ్‌కు చోటు లభించింది. బుధవారం ఢిల్లీ హైకోర్టు రాజీవ్‌పై అనర్హత వేటు వేయడంతో ఈ మార్పు చోటు చేసుకుంది. ఎఎఫ్ఐ నిర్దేశించిన క్వాలిఫయింగ్ మార్క్‌ను సాధించినప్పటికీ తేజశ్విన్ను కాదని ఎఎఫ్ఐ రాజీవ్‌కు చోటు కల్పించింది. దీంతో తేజశ్విన్ భారత ఒలింపిక్ అసోసియేషన్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో తీర్పు తేజశ్విన్కు అనుకూలంగా రావడంతో రాజీవ్ స్థానంలో తేజశ్విన్ హైజంప్‌లో భారత్ తరఫున కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రాతినిధ్యం వహించనున్నాడు.