Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్-ఇంగ్లండ్ తొలి టి20 నేడు
- రా.10.30గం||ల నుంచి సోనీలో
సౌథాంప్టన్: ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను డ్రాగా ముగించిన భారత్.. ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌కు సిద్ధమైంది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో కుర్రాళ్లు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పర్యటనకు ముందు యువ క్రికెటర్ల బృందం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ రెండు టి20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. అదే ఉత్సాహంతో ఇంగ్లండ్‌కు చేరిన జట్టు రెండు వార్మర్ మ్యాచుల్లోనూ ఘన విజయం సాధించిన ఉత్సాహంలో ఉంది. దుర్భేద్యఫామ్‌లో ఉన్న భారత జట్టును వాళ్ల గడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించడం కొంచెం కష్టమే. చివరి టెస్ట్‌లో బెయిర్‌స్టో, రూట్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌ను ఒంటిచేత్తో గెలిపించారు. జేసన్ రారు, బెన్ స్టోక్స్, బెయిర్‌స్టో ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసి రానుంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. టెస్ట్ సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. కేఎల్ రాహుల్ గాయంతో ఇంగ్లండ్ పర్యటనకు దూరమైనా.. శుభ్‌మన్ గిల్ తన చోటును కాపాడుకోవాలంటే ఈ ఫార్మాట్లోనైనా రాణించాల్సిన సమయం ఆసన్నమైంది. రెండు, మూడు టి20లు శని, ఆదివారం జరగనున్నాయి.