Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ
కౌలాలంపూర్: మలేషియా మాస్టర్స్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో పివి సింధు, పారుపల్లి కశ్యప్, సాయి ప్రణీత్, ప్రణయ్ రాయ్ విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌లో 7వ సీడ్ పివి సింధు 21-13, 17-21, 21-15తో చైనాకు చెందిన 9వ సీడ్ హి-బింగ్జియావోపై మూడుసెట్ల హౌరాహౌరీ పోరులో నెగ్గింది. ఇక పురుషుల సింగిల్స్‌లో బి. సాయి ప్రణీత్ 21-8, 21-9తో టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనలిస్ట్ కెవిన్ కొర్డాన్(..)పై, పారుపల్లి కశ్యప్ 16-21, 21-16, 21-16తో టామీ సుగియార్టో(ఇండోనేషియా)పై పోరాడి నెగ్గాడు.
మరో పోటీలో హెచ్ఎస్ ప్రణరు రారు 21-19, 21-14తో ఫ్రాన్స్‌కు చెందిన లెవెర్డెజ్పై గెలుపొంది రెండోరౌండ్లోకి ప్రవేశింంచాడు. ఇక సమీర్ వర్మ 21-10, 12-21, 14-21తో 5వ సీడ్ ఛో-టిన్ చెన్(చైనా) చేతిలో, సైనా నెహ్వాల్ 21-16, 17-21, 14-21తో కిమ్-గ-యున(కొరియా) చేతిలో పోరాడి ఓటమిపాలయ్యారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-ఎన్ సిక్కిరెడ్డి జోడీ 19-21, 21-18, 16-21తో ఇండోనేషియా జోడీ చేతిలో తొలిరౌండ్లోనే పరాజయాన్ని చవిచూశారు.