Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అదరగొట్టాడు. కెరీర్లో తొలిసారి బ్యాటర్స్ జాబితాలో టాప్-10లో చోటు దక్కించుకోగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్-10లో చోటు కోల్పోయాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదోటెస్టు మ్యాచ్ తర్వాత ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రిషభ్ పంత్ 801పాయింట్లతో కెరీర్ అత్యుత్తమ 5వ స్థానానికి చేరుకున్నాడు. ఇక రోహిత్ శర్మ(746పాయింట్లు) 9వ స్థానానికి పడిపోయాడు. ఇదే క్రమంలో కోహ్లి(714పాయింట్లు) 13వ స్థానానికి పడిపోయాడు. ఇక ఇంగ్లండ్ మాజీ సారధి జో రూట్ తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగా.. స్టార్ జానీ బెయిర్‌స్టో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకు చేరుకున్నాడు. కోహ్లి ఇలా టాప్-10లో చోటు కోల్పోవడం గత ఆరేళ్లలో ఇదే తొలిసారి. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా(384పాయింట్లు), అశ్విన్ (335పాయింట్లు) టాప్-2లో ఉన్నారు. ఇక బౌలర్ల జాబితాలో అశ్విన్ 2, బుమ్రా 3వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.