Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ టాప్-10లో జానీ బెయిర్‌స్టో
దుబాయ్ : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇరగదీసిన ధనాధన్ బ్యాటర్లు రిషబ్ పంత్, జానీ బెయిర్‌స్టోలు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విలువైన స్థానాలు ఎగబాకారు. భారత స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలువగా.. ఇంగ్లాండ్ డ్యాషింగ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో టాప్-10లోకి అడుగుపెట్టాడు. ఛేదనలో అజేయ శతకంతో చెలరేగిన జో రూట్ కెరీర్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు సాధించాడు. 923 రేటింగ్ పాయింట్లతో వరల్డ్ నం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు 47వ స్థానంలో నిలిచిన జానీ బెయిర్‌స్టో వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగు శతకాలతో పదో ర్యాంక్ సాధించాడు. 2018 తర్వాత జానీ బెయిర్‌స్టో తొలిసారి టాప్-10లోకి ప్రవేశించాడు. మార్నస్ లబుషేన్ (ఆస్ట్రేలియా), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), బాబర్ ఆజామ్ (పాకిస్థాన్) రూట్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి టాప్-10లో చోటు కోల్పోయాడు. నాలుగు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్‌కు పడిపోయాడు.