Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం
సౌతాంప్టన్ : హార్దిక్ పాండ్య ఆల్‌రౌండ్ విశ్వరూపంతో తొలి టీ20లో ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 33 బంతుల్లో 51 పరుగుల ఇన్నింగ్స్‌తో చెలరేగిన హార్దిక్ పాండ్య.. నాలుగు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు. హార్దిక్ పాండ్య ధనాధన్‌తో భారత్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులు చేసింది. దీపక్ హుడా (33, 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (39, 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో జోశ్ బట్లర్ (0) డకౌట్ కాగా.. మలాన్ (21), మోయిన్ అలీ (36), బ్రూక్ (28), జోర్డాన్ (26) పోరాటం సరిపోలేదు. 19.3 ఓవర్లలో 148 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది.