Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం
- ఫైనల్లో జబీర్‌పై గెలుపు
లండన్: రష్యా క్రీడాకారులపై టోర్నీ నిర్వాహకులు నిషేధం విధించడంతో కజకిస్తాన్ తరఫున బరిలోకి దిగిన 17వ సీడ్ ఎలేనా రైబకినా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ నయా ఛాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో 23ఏళ్ల రైబకినా 3-6, 6-2, 6-2తేడాతో 3వ సీడ్ ట్యునీషియా అమ్మాయి ఆన్స్ జబీర్ను చిత్తుచేసింది. తొలిసెట్‌ను కోల్పోయిన ఎలేనా.. ఆ తర్వాత రెండు సెట్లలో గొప్ప పుంజుకొని సత్తా చాటింది.వీళ్లిద్దరూ ఓ గ్రాండ్‌స్లామ్‌లో ముఖాముఖి తలపడడం ఇదే ప్రథమం. తొలి సెట్లో ఒక బ్రేక్ పాయింట్ సాధించి జబీర్ ఆ సెట్‌ను 6-3తో చేజిక్కించు కుంది. ఆ తర్వాత ఎలేనా రెండు, మూడు సెట్లలో అద్భుతంగా పుంజుకొని రెండేసి బ్రేక్ పాయింట్లు సాధించి ఏకంగా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజేతగా నిలిచిలి ంది. సెమీస్‌లో రిబకినా 6-3, 6-3తో మాజీ ఛాంపి యన్ సిమోనా హలెప్(రొమేనియా)పై అలవోక విజయం సాధించగా.. అన్స్ జబీర్ 6-2, 3-6, 6-1తో అన్‌సీడెడ్ టాంజానా మరియా(జర్మనీ)పై మూడుసెట్ల హౌరా హౌరీ పోరులో నెగ్గి ఫైనల్లోకి దూసుకొచ్చారు. 3వ సీడ్ అన్స్ జబీర్..17వ సీడ్ ఎలేనా మారియా మంచి స్నేహి తులు.ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరడం వీరిద్దరూ ఇదే తొలిసారి. జబీర్ ఆఫ్రికా ఖండం తరఫున ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లోకి చేరిన తొలి క్రీడాకారిణిగా ఇప్పటికే రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.