Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మలేషియా మాస్టర్స్ సూపర్ సిరీస్‌లో ముగిసిన భారత్ పోరు
కౌలాలంపూర్: మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరు ముగిసింది. సెమీస్‌కు చేరిన ఆశలు రేపిన ఏకైక షట్లర్ హెచ్ఎస్ ప్రణరు రారు శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ పోటీలో పరాజయం పాలయ్యాడు. సెమీస్‌లో ప్రణరు 21-17, 9-21, 17-21తో ఎన్జి కా-లాంగ్(హాంకాంగ్) చేతిలో మూడుసెట్ల హౌరాహౌరీ పోరులో ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్‌ను చేజిక్కించుకున్న ప్రణరు.. ఆ తర్వాత రెండో సెట్లో ఏమాత్రం ప్రతిఘటన చూపలేకపోయాడు. నిర్ణయాత్మక మూడోగేమ్‌లో పోరాడినా చివర్లో ఓటమిపాలయ్యాడు. ఇరువురు షట్లర్ల మధ్య ఈ పోటీలో గంటా నాలుగు నిమిషాలసేపు సాగింది. లాంగ్‌తో ఇంతకుముందు తలపడిన మూడుసార్లు ప్రణరు విజయం సాధించాడు. మరో సెమీస్‌లో వార్డోయో(మలేషియా) 20-22, 23-21, 21-19తో లూ-గ్వాంజు(చైనా)పై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇక మహిళల సింగిల్స్ ఫైనల్లోకి 3వ సీడ్ అన్-సె-యంగ్(కొరియా), 4వ సీడ్ చెన్-యు-ఫీ(చైనా) ప్రవేశించారు.