Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో టి20లో 49పరుగుల తేడాతో టీమిండియా గెలుపు
- టి20 సిరీస్ కైవసం
బర్మింగ్‌హామ్: ఐదో టెస్ట్‌లో ఓటమిపాలైన టీమిండియా.. టి20ల్లో అదరగొడుతోంది. శనివారం జరిగిన రెండో టి20లో 49పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఛేదనలో ఇంగ్లండ్ జట్టు 17 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ కలిసి 4.5 ఓవర్లలో 49 పరుగులు జోడించారు. రోహిత్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 31 పరుగులు చేయగా, ఓపెనర్‌గా వచ్చిన రిషబ్ పంత్ 15బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్ సాయంతో 26 పరుగులు చేశాడు. అయితే, ఇంగ్లండ్ జట్టులో కొత్త బౌలర్ రిచర్డ్ గ్లీసన్ అద్భుత బౌలింగ్‌తో కేవలం 15 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్లోనూ కోహ్లీ వైఫల్యాల పరంపర కొనసాగింది. కోహ్లి కేవలం 3 బంతులను ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి మలన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4, గ్లీసన్ 3 వికెట్లు దక్కాయి. ఛేదనలో ఇంగ్లండ్‌ను భువనేశ్వర్ కుమార్ మరోసారి దెబ్బతీసాడు. ఫామ్‌లో ఉన్న జేసన్ రారును(0), కెప్టెన్ బట్లర్(4)లను ఔట్ చేసి తొలుతే ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచాడు. ఆ తర్వాత మలన్(19), లివింగ్‌స్టోన్(15)కి తోడు మొయిన్ అలీ(35), విల్లీ(33) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. మిగతా బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ భువనేశ్వర్(3/15)కి తోడు బుమ్రా(2/10), చాహల్(2/10) బౌలింగ్‌లో మెరిసారు. మూడో టి20 ఆదివారం జరగనుంది.
స్కోర్‌బోర్డు..
ఇండియా ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి)బట్లర్ (బి)గ్లీసన్ 31, రిషబ్ పంత్ (సి)బట్లర్ (బి)గ్లీసన్ 26, కోహ్లి (సి)మలన్ (బి)గ్లీసన్ 1, సూర్యకుమార్ (సి)కర్రన్ (బి)జోర్డాన్ 15, హార్దిక్ పాండ్యా (బి)మలన్ (బి)జోర్డాన్ 12, జడేజా (నాటౌట్) 46, దినేశ్ కార్తీక్ (రనౌట్) బ్రోక్స్/బట్లర్ 12, హర్షల్ పటేల్ (సి)గ్లీసన్ (బి)జోర్డాన్ 13, భువనేశ్వర్ (సి)విల్లీ (బి)జోర్డాన్ 2, బుమ్రా (నాటౌట్) 0, అదనం 12. (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 170పరుగులు.
వికెట్ల పతనం: 1/49, 2/61, 3/89, 4/89, 5/122, 6/122, 7/145, 8/159 బౌలింగ్: విల్లీ 3-0-35-0, సామ్ కర్రన్ 3-0-26-0, మొయిన్ అలీ 2-0-23-0, గ్లీసన్ 4-1-15-3, పార్కిన్సన్ 2-0-21-0, జోర్డాన్ 4-0-27-4, లివింగ్‌స్టోన్ 2-0-23-0
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రారు (సి)రోహిత్ (బి)భువనేశ్వర్ 0, బట్లర్ (సి)పంత్ (బి)భువనేశ్వర్ 4, డేవిడ్ మలన్ (సి)హర్షల్ (బి)చాహల్ 19, లివింగ్‌స్టోన్ (బి)బుమ్రా 15, బ్రోక్స్ (సి)సూర్యకుమార్ (బి)చాహల్ 8, మొయిన్ అలీ (సి)రోహిత్ (బి)హార్దిక్ 35, సామ్ కర్రన్ (సి)హార్దిక్ (బి)బుమ్రా 2, విల్లీ (నాటౌట్) 33, జోర్డాన్ (రనౌట్) చాహల్/రోహిత్ 1, గ్లీసన్ (సి)కోహ్లి (బి)భువనేశ్వర్ 2, పార్కిన్సన్ (బి)హర్షల్ 0, అదనం 2. (17 ఓవర్లలో ఆలౌట్) 121 పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/11, 3/27, 4/41, 5/55, 6/60, 7/94, 8/95, 9/109, 10/121
బౌలింగ్: భువనేశ్వర్ 3-1-15-3, బుమ్రా 3-1-10-2, హార్దిక్ 3-0-29-1, హర్షల్ 4-0-34-1, చాహల్ 2-0-10-2, జడేజా 2-0-22-0