Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వింబుల్డన్ చాంపియన్ జకోవిచ్
- ఫైనల్లో కిర్గియోస్‌పై ఘన విజయం
లండన్ : వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్ (సెర్బియా) రికార్డు సృష్టించాడు. వింబుల్డన్‌లో వరుసగా నాల్గో, ఓవరాల్‌గా ఏడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నిక్ కిర్గియోస్ (ఆస్ట్రేలియా)పై ఘన విజయం సాధించిన జకోవిక్ కెరీర్ 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడాడు. 4-6, 6-3, 6-4, 7-6(7-3)తో నొవాక్ జకోవిచ్ గెలుపొందాడు. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన జకోవిక్‌కు తొలి సెట్లో చుక్కెదురైంది. తొలిసారి టైటిల్ పోరులో ఆడుతున్న కిర్గియోస్ 6-4తో తొలి సెట్లో గెలుపొంది జోకర్‌కు షాకిచ్చాడు. వరుసగా తర్వాతి రెండు సెట్లను గెల్చుకున్న జకోవిచ్ 2-1తో ముందంజ వేశాడు. కానీ నాల్గో సెట్లో జకోవిచ్‌కు గట్టి ప్రతిఘటన ఎదురైంది. టైబ్రేకర్‌కు దారితీసిన నాల్గో సెట్‌ను 7-3తో జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ విజేతగా అవతరించాడు. వింబుల్డన్‌లో స్విస్ యోధుడు రోజర్ ఫెదరర్ ఎనిమిది టైటిళ్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. జకోవిచ్ ఏడో టైటిల్‌తో అతడి తర్వాతి స్థానంలో నిలిచాడు. తొలిసారి ఫైనల్స్‌కు చేరుకున్న నిక్ కిర్గియోస్ రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకున్నాడు.