Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బరిలో కిదాంబి శ్రీకాంత్, ప్రణరు
- నేటి నుంచి సింగపూర్ సూపర్ 500
సింగపూర్ : ప్రతిష్టాత్మక బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలకు ముందు జరుగుతున్న చివరి టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి షట్లర్లు సత్తా చాటాలని చూస్తున్నారు. వరుసగా ఇండోనేషియా, మలేషియా మాస్టర్స్‌లో సెమీస్‌కు చేరుకున్న హెచ్.ఎస్ ప్రణరు సింగపూర్‌లోనూ టైటిల్‌పై కన్నేసి బరిలోకి దిగుతున్నాడు. ప్రియ ప్రత్యర్థి తైజుయింగ్ చేతిలో వరుసగా ఆరో ఓటమితో వరుస టోర్నీల నుంచి నిష్క్రమించిన పి.వి సింధు సింగపూర్ సూపర్ సిరీస్‌ను సవాల్‌గా తీసుకుంటోంది. గాయంతో కీలక టోర్నీలకు దూరమైన కిదాంబి శ్రీకాంత్ తాజాగా సింగపూర్‌లో రాకెట్ పట్టనున్నాడు. సింధు, శ్రీకాంత్, ప్రణరు బరిలో నిలువటంతో సింగపూర్ ఓపెన్‌లో భారత్ అటు మెన్స్, ఇటు ఉమెన్స్ విభాగాల్లో టైటిల్‌పై కన్నేసింది. నేటి నుంచి సింగపూర్ సూపర్ 500 టోర్నీ ఆరంభం.
మహిళల సింగిల్స్ విభాగంలో వరల్డ్ నం.7 పి.వి సింధుకు సులువైన డ్రా ఎదురైంది. తొలి మ్యాచ్‌లో సింధుకు బెల్జియం షట్లర్ లియానె టాన్ ఎదురు కానుంది. క్వార్టర్స్‌లో థారులాండ్ అమ్మాయి బుసానన్ ఢకొీట్టే వీలుంది. బుసానన్‌పై సింధుకు 17-1తో తిరుగులేని ముఖాముఖి రికార్డు ఉంది. సెమీఫైనల్లోనే మరోసారి తైజుయింగ్ సవాల్ తారసపడనుండటంతో.. ఈసారి సింధు కొత్తగా సిద్ధం కానుంది. సింధుపై తైజుయింగ్ 16-5తో ముఖాముఖి రికార్డులో ఆధిపత్యం సాధించింది. వెటరన్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో సహచర క్రీడాకారిణి మాళవిక బాన్సోద్తో తలపడనుంది. తర్వాతి రౌండ్లో హీ బింగ్జియావ్, రచనొక్ ఇంటానన్లో ఒకరు ఎదురుపడనున్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో హెచ్.ఎస్ ప్రణరు భీకర ఫామ్‌లో ఉన్నారు. వరుసగా రెండు టోర్నీల్లో సెమీస్‌కు చేరుకున్నాడు. సింగపూర్‌లో తుది పోరులో ఆడేందుకు ఆసక్తిగా కనిపిస్తున్నాడు. ఇక గాయం నుంచి కోలుకున్న కిదాంబి శ్రీకాంత్‌కు సైతం సులువైన డ్రా ఎదురైంది. సాయిప్రణీత్, సమీర్ వర్మలు శ్రీకాంత్‌తో ఢకొీట్టే అవకాశం ఉంది.