Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే షట్లర్ల కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బారు) శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనుంది. జులై 18-24 వరకు హైదరాబాద్‌లో కామనెవెల్త్ క్యాంప్‌కు ఏర్పాట్లు చేస్తోంది. బర్మింగ్‌హామ్ క్రీడలకు బారు పది మంది షట్లర్లను పంపుతోంది. శిక్షణ శిబిరంలో షట్లర్లు అందరూ అన్ని విభాగాల్లో కలిసి ఆడనున్నారు. జాతీయ కోచ్‌లు క్యాంప్‌ను పర్యవేక్షించనున్నారు. 'కామన్వెల్త్ క్రీడలకు ముందు షట్లర్లు అందరూ ఒకచోట కలిసి సాధన చేయటం కీలకం. ప్రాక్టీస్ సెషన్లతో ఆటగాళ్లు లయ అందుకుంటారు. జట్టు ప్రణాళికలను మెరుగ్గా చర్చించి, అవగాహన చేసుకుంటారని' బారు కార్యదర్శి సంజరు మిశ్రా తెలిపారు. ఈ నెల 25న బ్యాడ్మింటన్ జట్టు బ్రిటన్‌కు బయల్దేరనుంది. పి.వి సింధు బ్యాడ్మింటన్ జట్టుకు సారథ్యం వహించనుంది.