Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీకాంత్‌కు అనూహ్య పరాజయం
సింగపూర్ ఓపెన్ 500
సింగపూర్ : భారత బ్యాడ్మింటన్ అగ్ర క్రీడాకారుడు, మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ అనూహ్య పరాజయం చవిచూశాడు. చారిత్రక థామస్ కప్ విజయానంతరం గాయంతో విరామం తీసుకున్న శ్రీకాంత్ సింగపూర్ ఓపెన్ బరిలో నిలిచాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్ పోరులో సహచర షట్లర్ మిథున్ మంజునాథ్ చేతిలో శ్రీకాంత్ మూడు గేముల మ్యాచ్‌లో పోరాడి ఓడాడు. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో 21-17, 15-21, 21-18తో మంజునాథ్ కెరీర్ అతిపెద్ద విజయం నమోదు చేశాడు. వెటరన్ షట్లర్ పారుపల్లి కశ్యప్ 14-21, 15-21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. సమీర్ వర్మ సైతం 10-21, 13-21తో లి షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓటమి చెందాడు. స్టార్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణరు 21-13, 21-16తో వరుస గేముల్లో థారులాండ్ షట్లర్‌ను చిత్తు చేసి ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.
మహిళల సింగిల్స్‌లో అగ్ర షట్లర్లు పి.వి సింధు, సైనా నెహ్వాల్ శుభారంభం చేశారు. 21-15, 21-11తో వరుస గేముల్లో లియానె (బెల్జియం)పై ఏకపక్ష విజయం నమోదు చేసింది. వెటరన్ షట్లర్ సైనా నెహ్వాల్ 21-18, 21-14తో సహచర షట్లర్ మాళవిక బాన్సోద్‌పై గెలుపొందింది.