Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వన్డేల్లో మెరుగైన ర్యాంక్
- బౌలర్లలో టాప్‌లేపిన బుమ్రా
దుబాయ్ : ఇంగ్లాండ్‌పై పది వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసిన టీమ్ ఇండియా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో స్థానం మెరుగుపర్చుకుంది. పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టిన భారత్ మూడో స్థానానికి చేరుకుంది. 127 పాయింట్లతో న్యూజిలాండ్, 122 పాయింట్లతో ఇంగ్లాండ్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. మూడో స్థానం నిలుపుకునేందుకు భారత్ తాజా వన్డే సిరీస్‌ను కనీసం డ్రా చేసుకోవాలి. 108 రేటింగ్ పాయింట్లు సాధించిన భారత్.. పాకిస్థాన్ (106) కంటే రెండు పాయింట్ల ముందంజలోనే నిలిచింది. 101 పాయింట్లతో ఆస్ట్రేలియా ఐదో స్థానంలో కొనసాగుతోంది. నెలాఖరులో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సైతం ఉండటంతో వన్డే ర్యాంకింగ్స్‌లో మరింత ఎగబాకేందుకు భారత్ రంగం సిద్ధం చేసుకుంది.
వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో భారత పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా టాప్ లేపాడు. ది ఓవల్‌లో ఇంగ్లాండ్‌పై 6/19తో కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బుమ్రా.. వన్డేల్లో నం.1గా బౌలర్‌గా నిలిచాడు. మూడు స్థానాలు మెరుగైన బుమ్రా.. అగ్రస్థానానికి చేరుకున్నాడు. భారత బౌలర్లలో మరెవరు టాప్-10లో నిలువలేదు. ఇంగ్లాండ్‌తో చివరి టీ20లో మెరుపు శతకం సాధించిన సూర్యకుమార్ యాదవ్ టీ20 బ్యాటర్ల జాబితాలో ఏకంగా 44 స్థానాలు ఎగబాకాడు. కెరీర్ అత్యుత్తమ నం.5 ర్యాంక్ సాధించాడు. పొట్టి సిరీస్‌లో రాణించిన భువనేశ్వర్ కుమార్ బౌలర్ల జాబితాలో టాప్-10లో చోటు సాధించాడు.