Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విండీస్ పర్యటనకు జట్లను ప్రకటించిన బిసిసిఐ
ముంబయి: వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే వైట్‌బాల్ సిరీస్ జట్లను బిసిసిఐ గురువారం ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా భారత్-విండీస్ జట్ల మధ్య ఐదు టి20లు, మరో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఇరు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను ప్రకటించిన బిసిసిఐ.. టి20లకు కోహ్లి, బుమ్రా, చాహల్‌లకు విశ్రాంతి కల్పించింది. వారి స్థానంలో కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లకు చోటు కల్పించింది. ఇక వన్డే జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు, వికెట్ కీపర్ రిషబ్ పంత్, పేసర్ భువనేశ్వర్ కుమార్‌లకు విశ్రాంతి కల్పించింది. వన్డే సిరీస్ ముగిసిన అనంతరం వీరు భారత్‌కు బయల్దేరి రానున్నారు. జులై 22నుంచి ప్రారంభం మూడు వన్డేల సిరీస్ కానుండగా.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఈ సిరీస్ జరగనుంది. భారతజట్టు షెడ్యూల్ ప్రకారం గత ఏడాది నవంబర్లోనే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నా.. కరోనా దృష్ట్యా అప్పట్లో ఈ సిరీస్ వాయిదా పడింది.
జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోరు, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఆర్ష్‌దీప్ సింగ్.
షెడ్యూల్..
జులై 22 : తొలి వన్డే(పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
జులై 24 : రెండో వన్డే(పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
జులై 27 : మూడో వన్డే(పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
జులై 29 : తొలి టి20(టరోబా)
ఆగస్టు 1 : రెండో టి20(సెయింట్ కిట్స్)
ఆగస్టు 2 : మూడో టి20(సెయింట్ కిట్స్)
ఆగస్టు 6 : నాల్గో టి20(ఫ్లోరిడా)
ఆగస్టు 7 : ఐదో టి20(ఫ్లోరిడా)