Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్‌కు సింధు, ప్రణరు
- సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సింగపూర్: సింగపూర్ ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు సత్తా చాటారు. మహిళల విభాగంలో సైనా నెహ్వాల్, పివి సింధుతోపాటు పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణరు రారు క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు. మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 21-19, 11-21, 21-17తో 5వ సీడ్ హి-బింగ్జియావో(చైనా)పై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సుమారు 58నిమిషాలసేపు సాగింది. ఇక సింధు 19-21, 21-18, 21-18తో వియత్నాంకు చెందిన థూ-లిన్-నియోన్పై పోరాడి నెగ్గింది. క్వార్టర్స్‌లో సింధు.. చైనాకు చెందిన హన్-యుతో పోటీపడనుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో 19వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణరు రారు 14-21, 22-20, 21-18తో 4వ ర్యాంకర్, ఛో-టిన్-చెన్(చైనీస్ తైపీ)పై ఉత్కంఠ పోటీలో గెలిచాడు. ఇక పురుషుల డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్-ధృవ్ కపిల జోడీ 18-21, 24-22, 21-18తో 6వ సీడ్ మలేషియాకు చెందిన ఘో-ఫెల్, నూర్ ఇజ్జుద్దీన్‌లపై గెలుపొంది క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. తొలిరౌండ్లో కిదాంబి శ్రీకాంత్‌పై సంచలన విజయం సాధించిన మిథున్ మంజునాథ్ రెండో రౌండ్లో ఓటమిపాలయ్యాడు. 19-21, 21-18, 16-21తో ఐర్లాండ్‌కు చెందిన నాట్ నుయెన్ చేతిలో పోరాడి ఓడాడు.