Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లండ్ 246ఆలౌట్
లండన్: రెండో వన్డేలోనూ టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించారు. తొలి వన్డేలో పేసర్ల హవా కొనసాగగా.. ఈసారి స్పిన్నర్ యజ్ఞేంద్ర చాహల్ ఇంగ్లండ్‌ను దెబ్బ తీసాడు. లార్డ్ వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలోనూ టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి బౌలింగ్‌ను ఎంచుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్స్ వికెట్లు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో జేసన్ రారు(23) ధాటిగా ఆడే క్రమంలో హార్దిక్ చేతికి చిక్కి ఔటయ్యాడు. ఆ తర్వాత స్పిన్నర్ చాహల్ తన మాయాజాల బౌలింగ్‌తో బెయిర్‌స్టో(38)ను బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలోనే జో రూట్(11), బెన్ స్టోక్స్(21)ను కూడా ఎల్బీలుగా ఔట్ చేయడంతో ఇంగ్లండ్ జట్టు 87పరుగులకే ప్రధాన వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మరోవైపు షమీ కూడా కెప్టెన్ బట్లర్(4)ను బౌల్డ్ చేయడంతో 102పరుగులకే ఇంగ్లండ్ సగం వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో సీనియర్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ(47), డేవిడ్ విల్లీ(41) వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ ఔటయ్యే సమయానికి ఇంగ్లండ్ జట్టు 210 పరుగులకే చేరుకోవడం విశేషం. లోయర్ ఆర్డర్ బ్యాటర్స్‌ను కూడా త్వరగా ఔట్ చేయడంతో భారత బౌలర్లు సఫలమయ్యారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 49 ఓవర్లలో 246పరుగులు చేయగల్గింది. చాహల్‌కు నాలుగు, హార్దిక్, బుమ్రాకు రెండేసి, షమీ, ప్రసిధ్‌కు తలా ఒక వికెట్ లభించాయి.
స్కోర్‌బోర్డు..
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రారు (సి)సూర్యకుమార్ (బి)హార్దిక్ 23, బెయిర్‌స్టో (బి)చాహల్ 38, రూట్ (ఎల్బి)చాహల్ 11, స్టోక్స్ (ఎల్బి)చాహల్ 21, బట్లర్ (బి)షమీ 4, లివింగ్‌స్టోన్ (సి)సబ్ శ్రేయస్ (బి)హార్దిక్ 33, మొయిన్ (సి)జడేజా (బి)చాహల్ 47, డేవిడ్ విల్లీ (సి)సబ్ శ్రేయస్ (బి)బుమ్రా 41, ఓవర్టన్ (నాటౌట్) 10, కర్స్ (ఎల్బి)ప్రసిధ్ 2, టోప్లే (బి)బుమ్రా 3, అదనం 13. (49ఓవర్లలో ఆలౌట్) 246పరుగులు.
వికెట్ల పతనం: 1/41, 2/72, 3/82, 4/87, 5/102, 6/148, 7/210, 8/237, 9/240, 10/246. బౌలింగ్: మహ్మద్ షమీ 10-0-44-1, బుమ్రా 10-1-48-2, హార్దిక్ 6-0-28-2, ప్రసిధ్ కృష్ణ 8-0-53-1, చాహల్ 10-0-47-4, జడేజా 5-0-17-0