Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల
దుబాయ్: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకున్న టీమిండియా ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటింది. అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసీసీ) సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఇండియా(109పాయింట్లు) మూడో స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ జట్టు(128పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టు 121పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. భారత్ మూడో స్థానానికి చేరుకుంది. ఇక పాకిస్తాన్ 106 పాయింట్లు, ఆస్ట్రేలియా 101పాయింట్లు టాప్-5లో ఉన్నాయి. ఈ వారంలోనే భారతజట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఆ పర్యటనలో భాగంగా ఐదు టి20, మూడు వన్డేల్లో భారత్-వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఆ పర్యటనలోనూ భారత్ రాణిస్తే మరి కొన్ని పాయింట్లు భారత్ ఖాతాలో జమ కానున్నాయి. ఇదే క్రమంలో పాకిస్తాన్ జట్టు నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లి ఐదురోజుల వ్యవధిలో ఆ జట్టుతో మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ రెండు సిరీస్‌లు ముగిసిన అనంతరం ర్యాంకింగ్స్‌లో మార్పులు చోటు చేసుకొనే అవకాశముంది.
జట్టును ప్రకటించిన విండీస్..
జులై 22నుంచి భారత్‌తో ప్రారంభం కానున్న వైట్‌బాల్ సిరీస్‌కు వెస్టిండీస్ జట్టును ప్రకటించింది. 13మంది జట్టు సభ్యుల బృందానికి నికోలస్ పూరన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు.