Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు పతకాలు జమైకా ఖాతాలోనే..
యుజీన్(అమెరికా): చంటి బిడ్డ తల్లి, జమైకాకు చెందిన 35ఏళ్ల షెల్లీ-ఆన్ ఫ్రేజర్ ప్రైస్ 100మీ. స్ప్రింట్ విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో షెల్లీ 10.67సెకన్లలో గమ్యానికి చేరి రికార్డుస్థాయిలో 5వ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అంతకుముందు 2009, 2013, 2015, 2019 ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఫ్రైజర్ స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. ఈ విభాగంలో జమైకాకేచెందిన షెరిక్కా జాక్సన్(10.73సెకన్లు), నాలుగుసార్లు ఒలింపిక్ ఛాంపియన్ ఎలీనా థామ్సన్ హెరాV్‌ా(10.81సెకన్లు) రజతక, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. దీంతో ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ స్ప్రింట్ విభాగంలో వరుసగా మూడు పతకాలు జమైకానే కైవసం చేసుకోవడం విశేషం. చరిత్రలో జమైకా మహిళల జట్టు 100మీ. స్ప్రింట్ విభాగంలో మూడు పతకాలను కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. అంతకుముందు ఫ్రెడ్ కెర్లీ సారథ్యంలోని జమైకా జట్టు 100మీ. విభాగంలో మూడు పతకాలను మూడుసార్లు కైవసం చేసుకుంది. ఇక అమెరికాకు చెందిన అల్లెసన్ ఫెలిక్స్ ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించాలన్న కల నిష్ప్రయోజనమైంది.
పురుషుల 100మీ. స్ప్రింట్‌లో అమెరికా హవా..
పురుషుల 100మీ. పరుగులో ఆతిథ్య అమెరికా హవా కొనసాగింది. ఈ విభాగంలో మూడు పతకాలు అమెరికాకే దక్కాయి. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఫ్రెడ్ కెర్లీ 9.86సెకన్లలో గమ్యానికి చేరి కొత్త చిరుతగా అవతరిం చాడు. ఈ క్రమంలో అమెరికాకే చెందిన మార్విన్ బ్రేసి (9.88సెకన్లు), బ్రోమెల్(9.88సెకన్లు) వరుసగా రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. వీరిద్దరూ ఒకే టైమింగ్ నమోదు చేసినప్పటికీ 0.002సెకన్ల తేడాతో బ్రేసి రెండోస్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. 1991 తర్వాత అమెరికా మూడు పతకాలను కైవసం చేసుకోవడం ఇదే ప్రథమం.