Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో జరిగే టోర్నీల్లో కచ్చితంగా 90 మీటర్ల మార్క్‌ను అందుకుంటానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నాడు. ఎజున్(అమెరికా) వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న నీరజ్ సన్నాహాల్లో ఉన్నాడు. ఈ నెల 21నుంచి జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ పోటీలు మొదలవుతున్నాయి. గత నెలలో జరిగిన డైమండ్ లీగ్‌లో 89.94మీటర్ల దూరంతో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన నీరజ్ 90 మీటర్ల ప్రదర్శన చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొడుతున్న నీరజ్ చోప్రా..ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ అండర్ ఆర్మర్‌గా బ్రాండ్ అంబాసీడర్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో చోప్రా మాట్లాడుతూ 'గత టోర్నీలో 90 మీటర్ల దూరానికి ఆరు సెంటీమీటర్ల దూరంలో ఆగిపోయాను. కచ్చితంగా ఈ ఏడాది అందుకుంటానన్న నమ్మకముంది. అండర్ ఆర్మర్‌తో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. అథ్లెటిక్స్‌లో సరైన జెర్సీ ప్రదర్శనపై ప్రభావం చూపిస్తుంది. ఈ బ్రాండ్‌తో మరిన్ని విజయాలు ఖాతాలో వేసుకుంటాను' అని అన్నాడు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో అండర్ ఆర్మర్ డిస్ట్రిబ్యూటర్ అండర్డాగ్ ఎండీ తుషార్ గోకుల్దాస్ పాల్గొన్నారు.