Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంటిగ్వా: వెస్టిండీస్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ దానిష్ రామ్దిన్తోపాటు లెండి సిమన్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం ట్విటర్ వేదికగా వీరిద్దరూ తమ రాజీనామా లేఖలను వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు పంపారు. 2019లో చివరిసారిగా వెస్టిండీస్ తరఫున టీ20 క్రికెట్ ఆడిన రామ్‌దిన్.. తను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నానని, ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రం ఆడతానని ప్రకటించాడు. వచ్చే కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) కోసం జరిగిన వేలంలో రామ్‌దిన్‌ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చెయ్యలేదు. డారెన్ సామీ రిటైర్ అయిన తర్వాత 2014లో విండీస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన అతను.. 2015లో జట్టు పగ్గాలను జేసన్ హోల్డర్‌కు అప్పగించాడు. ఇక సిమన్స్ సిపిఎల్లో అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రింబాగో నైట్‌రైడర్స్ తమ ట్విట్టర్ ఖాతాలో ముందుగా ఈ విషయాన్ని వెల్లడించింది. సిమన్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాడని వెల్లడించిన ట్రింబాగో నైట్ రైడర్స్.. సెకండ్ ఇన్నింగ్స్‌కు శుభాకాంక్షలు తెలిపింది.