Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 15నుంచి పారాలింపిక్స్ క్రీడలు
- ఐఓసి అధ్యక్షులు థామస్ బాచ్
రోమ్: జులై 14, 2028నుంచి లాస్ ఏంజెల్స్ వేదికగా ఒలింపిక్స్, ఆగస్టు 15నుంచి పారాలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసి) అధ్యక్షులు థామస్ బాచ్ మంగళవారం వెల్లడించారు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు ఇంకా ఆరేళ్ల సమయమున్నా.. కౌంట్‌డౌన్ మంగళవారం విడుదల చేశారు. యువకులు క్రీడలపట్ల ఆసక్తిని, ప్రాతినిధ్యం, సన్నద్ధం చేయడానికి ఈ కౌంట్‌డౌన్ ప్రేరణ కానుందని, స్టేడియంల నిర్మాణంతోపాటు ఈ క్రీడల్లో పాల్గొనేందుకు సుమారు 15వేలమంది వరకు అథ్లెట్లు పాల్గొనే అవకాశముందని థామస్ బాచ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 2028 ఒలింపిక్స్ జులై 14 నుంచి 30 వరకు.. పారాలింపిక్స్ క్రీడలు ఆగస్టు 15నుంచి 27వరకు లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్నాయి. ఇంతకుముందు లాస్ ఏంజెల్స్ 1932, 1984 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చింది.