Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒరెగాన్(అమెరికా): 3వేల మీటర్ల స్టీపిల్ఛేజ్లో జాతీయ రికార్డు నెలకొల్పిన అవినాశ్ సేబల్ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో 11వ స్థానంలో నిలిచాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో సేబల్ 8నిమిషాల 31.75సెకన్లతో గమ్యాన్ని పూర్తి చేశాడు. మొరాకోకు చెందిన సూఫియానే ఎల్ బక్కాలి 8నిమిషాల 25.73సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో ఇథియోపియన్ లామేచా గిర్మా రెండో స్థానంలో, కెన్యాకు చెందిన కాన్సెస్లస్ కిప్రూటో మూడో స్థానంలో నిలిచి రజత, కాంస్య పతకాలను సాధించారు. హీట్ విభాగంలో అవినాష్ ఓవరాల్‌గా 8:18.75 నిమిషాల్లో రేస్‌ను పూర్తిచేసి 7వ స్థానంలో నిలిచి ఫైనల్ చేరాడు. అదే ప్రతిభను ఫైనల్లోనూ చూపితే సేబల్కు పతకం ఖాయమయ్యేదే. అతని ప్రయత్నాన్ని అభినందించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సారు).. ''అద్భుతమైన పోరాటం కనబరిచావు. ఇదే మొమెంటం కొనసాగించు'' అని ట్వీట్ చేసింది. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరడం సేబల్కు ఇది రెండోసారి. 27ఏళ్ల మహరాష్ట్రకు చెందిన సేబల్ ఇంతకుముందు 2019 దోహా వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లోనూ పాల్గొని ఫైనల్‌కు చేరి.. ఫైనల్లో 13వ స్థానంలో నిలిచాడు.